సొంత జిల్లాలో వివేక్ కు షాక్ ఇస్తున్న ఆ నేత‌.. బీజేపీలో సైలెంట్ వార్‌..

తెలంగాణ బీజేపీలో ఆయ‌న చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేత‌.అంద‌రితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.

 The Leader Who Is Giving A Shock To Vivek In His Own District Silent War In Bjp-TeluguStop.com

ఒక‌ర‌కంగా చెప్పాలంటే మీడియా ప‌రంగా బీజేపీకి ఒక వాయిస్ గా ఉన్నారు.అంద‌రికంటే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు.

ఆయ‌నే వివేక్ వెంకట‌ స్వామి.టీఆర్ ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో బీజేపీలో జాయిన్ అయ్యారు.ఆ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.మొన్న ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోకి రావ‌డానికి ఒప్పించి కృషి చేశారు.కానీ ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే చాలా సైలెంట్ అయిపోతున్నారంట‌.

హుజూరాబాద్ లో ఈట‌ల వెన్నంటే ఉండి గెలుపులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

బండి సంజ‌య్‌కు చాలా న‌మ్మిన వ్య‌క్తి.అటు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.

రాష్ట్ర స్థాయి నేత‌ల్లో ఆయ‌న క‌చ్చితంగా ఉంటారు.ఇన్ని ర‌కాలుగా కీల‌కంగా ఉన్న వివేక్.

సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేస‌రికి మాత్రం చాలా సైలెంట్ అయిపోతున్నారు.ఇప్పుడు పెద్ద‌ప‌ల్లి జిల్లాలో వివేక్ త‌ప్ప ఎవ‌రూ కీల‌కంగా లేరు.

అటు జ‌గిత్యాల‌కు కూడా ఆయ‌నే కీల‌కంగా ఉంటూ వ‌స్తున్నారు.కానీ ఈ మ‌ధ్య సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని కార్య‌క‌ర్త‌ల‌ను, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంట‌.

ఇందుకు కార‌ణం ఏంటంటే.ఇక్క‌డ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణకు అలాగే వివేక్ కు ఎన్నో ఏండ్ల నుంచి విబేధాలు ఉన్నాయి.దీంతో జిల్లా అధ్య‌క్షుడిగా స‌త్య‌నారాయ‌ణ అన్ని కార్య‌క్ర‌మాల‌ను వివేక్ కు చెప్ప‌కుండానే చేసేస్తున్నారంట‌.అన్ని సొంత నిర్ణ‌యాల‌తో పార్టీని న‌డిపిస్తున్నారు.ఏ కార్య‌క్ర‌మానికి కూడా వివేక్ ను పిల‌వ‌ట్లేదంట‌.ఇక సోమార‌పు స‌త్యానారాయ‌ణ‌తో కాకుండా.

వివేక్ సొంతంగా మ‌రో గ్రూపును ఏర్పాటు చేసుకుని అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.పార్టీ అధినాయ‌క్త‌వానికి ఆ గ్రూపుకు సంబంధాలు పెంచేస్తూ.

ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌త్య‌నారాయ‌ణ ఆరోపిస్తున్నారు.మొత్తానికి ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ్రూపు త‌గాదాలు పెరుగుతున్నాయ‌నే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube