ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం లో" అన్నదానం" చేసిన తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం,ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం, డే కేర్ సెంటర్ ఎల్లారెడ్డిపేట లో వుండే వృద్ధులకు ఎల్లారెడ్డిపేట తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు ఒగ్గు బాలరాజు రజిత యాదవ్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారు వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది.

అనంతరం ఒగ్గు బాలరాజు వాళ్ల కుటుంబ సభ్యులు వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం కో -ఆర్డినేటర్ ఎం.మమత , సిబ్బంది పాల్గొన్నారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

Latest Rajanna Sircilla News