చివరి ఆశ కూడా గల్లంతు, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఖాయం

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో బీజేపీ మరియు శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అంతా భావించారు.

కాని ముఖ్యమంత్రి పీఠంను చెరి సగం రోజులు పంచుకోవాలంటూ శివసేన చేసిన ప్రతిపాధనను బీజేపీ కొట్టి పారేసింది.

ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠంను షేర్‌ చేసుకునేది లేదు అంటూ తేల్చి చెప్పింది.దాంతో శివసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు అంటూ భీష్మించుకు కూర్చుంది.

బీజేపీ తమను చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో ఎన్సీపీ మరియు కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన పార్టీ ప్రయత్నాలు చేసింది.శివసేన పార్టీ నాయకులు గత కొన్ని రోజులు ఎన్సీపీ అధినేత శరత్‌ పవార్‌తో చర్చలు జరిపారు.

కాని ఆయన మాత్రం శివసేన తమకు ఎప్పటికి శత్రు పార్టీనే అంటూ చెప్పుకొచ్చాడు.శివసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచన అస్సలు లేదంటూ పవార్‌ ప్రకటించాడు.

Advertisement

బీజేపీ మరియు శివసేనలు ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని సూచించాడు.తాము విపక్షంలో ఉంటామని అన్నాడు.

పవార్‌ ప్రకటనతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పేట్లు లేదని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం గడువు ముగియబోతుంది.

కనుక ఆ తర్వాత రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫార్సు చేసే అవకాశం ఉంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు