వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ( The kerala story ) రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆదా శర్మ( Adah sharma ) ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరో రూ.100 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని రూ.250 కోట్ల వసూళ్ల సినిమాల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఆలియా భట్, కంగనా( Alia bhatt,Kangana ) లకు సైతం సాధ్యం కానీ అరుదైన కలెక్షన్ రికార్డు ని ఆదా శర్మ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఆదాశర్మ పేరు జాతీయ స్థాయి మీడియా లో ప్రముఖంగా వినిపిస్తోంది.

ది కేరళ స్టోరీ సినిమా లో నటించిన నటించినందుకు గాను అదా శర్మను హత్య చేస్తాం అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించిన విషయం తెలిసిందే.దాంతో ఆమె భయపడకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది.ఆదా శర్మ ఎలాంటి బెరుకు లేకుండా జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇటీవల ఆమె ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్ కి గురి అవ్వడంతో మరింతగా ఆమె వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం ఆదా శర్మ యొక్క జోరు మామూలుగా లేదు.సాధారణంగా ఒక హీరోయిన్ కి ఇలాంటి కమర్షియల్ సక్సెస్ పడితే వరుసగా సక్సెస్ లు లభిస్తాయి.అదా శర్మ విషయంలో కూడా అదే జరగబోతోంది.
సౌత్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అదాశర్మ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి సరైన గుర్తింపు రాక పోవడంతో కనుమరుగయ్యింది.మళ్లీ అదృష్టం కొద్ది మెల్ల మెల్లగా ఆఫర్స్ దక్కించుకుంటూ సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇలాంటి సమయంలో కేరళ స్టోరీ చిత్రం ఆదా శర్మ కి మంచి బూస్ట్ ఇచ్చినట్లయితే ఈ సినిమాతో రాబోయే 10 సంవత్సరాల పాటు ఆదాశర్మ ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సౌత్ లో మరియు నార్త్ లో వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు భారీగా సంపాదించుకునే అవకాశం కూడా ఈమెకి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రస్తుతం ఆదా శర్మ లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఓకే చెప్తోంది.
ముందు ముందు కమర్షియల్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలు లేకపోలేదు.







