9/11 ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి పేరుని ప్రకటించిన అమెరికా

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికాను సైతం ఉలిక్కిపడేలా చేసిన 9/11 దాడులు జరిగి 18 గడిచిపోయాయి.సుమారు 3,000 మంది ప్రాణాలను బలిగొని.

 The Justice Department To Reveal Name Of Individual Accused-TeluguStop.com

వేలాది మందిని క్షతగాత్రులను చేసిన ఆ ఉగ్రదాడిని తలుచుకుంటేనే అమెరికన్ల వెన్నులో వణుకుపుడుతుంది.దాడికి వ్యూహారచన చేసిన అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను వెంటాడి వేటాడి చంపింది అమెరికా.

Telugu Hijackers, Telugu Nri Ups-

  ఈ క్రమంలో సౌదీ అరేబియా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి.విమానాలను హైజాక్ చేయడంతో పాటు ఇతర విషయాల్లో ఉగ్రవాదులకు సహాయం చేశాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు.ఒకానొక దశలో తీవ్రవాదులను సౌదీ ప్రభుత్వం సమన్వం చేసిందని.ఇందులో సదరు వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.

అమెరికాకు ఈ విషయం తెలిసినప్పటికీ.ఆ వ్యక్తి పేరును బయటపెట్టకుండా సౌదీ….

అగ్రరాజ్యంపై ఒత్తిడి తెచ్చింది.ఆ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు అనేక అధికారిక నివేదికలు వెలువడ్డాయి.

ఆ దాడులు ఎవరి పని… ఎలా చేశారన్న విషయాలను దర్యాప్తు ఏజెన్సీలు వెల్లడించాయి.హైజాక్‌కు పాల్పడిన 19 మంది అల్‌ఖైదా తీవ్రవాదుల్లో 15 మంది సౌదీ పౌరులే కావడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.

అయితే సౌదీ ప్రభుత్వం మాత్రం తమ దేశపౌరులకు 9/11 దాడులతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తూ వచ్చింది.

Telugu Hijackers, Telugu Nri Ups-

  మరోవైపు అమెరికా న్యాయశాఖ 2012లో వెలువరించిన నాలుగు పేజీల దర్యాప్తు నివేదికలో మొత్తం ముగ్గురు సౌదీపౌరులు ఉగ్రవాదులకు కాలిఫోర్నియాలో బస ఏర్పాట్లతో పాటు విమానాన్ని నడిపేందుకు శిక్షణ, పైలట్ లైసెన్స్ సమకూర్చారని నివేదిక చెబుతోంది.ఆ ముగ్గురిలో ఇద్దరి పేర్లు.ఫహద్ అల్ తుమైరీ, ఒమర్ అహ్మద్ అల్ బేయోమిలని అధికారులు నివేదికలో స్పష్టం చేయగా.

మూడో వ్యక్తి పేరు మాత్రం ప్రస్తావించలేదు.

అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి సౌదీ ప్రభుత్వంలో సీనియర్ ఉన్నతోద్యోగిగా తెలుస్తోంది.

అయితే 9/11 దాడులపై ఏర్పాటైన కమిషన్‌తో పాటు దర్యాప్తు సంస్థలు ఆ వ్యక్తి వివరాలను బయటకు చెప్పాలని ఫెడరల్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.దీనిలో భాగంగా 9/11 బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదులు సౌదీ ప్రభుత్వానికి నోటీసులు పంపారు.

దీంతో స్పందించిన సౌదీ ప్రభుత్వం సమాచార మార్పడి కింద పలు కీలక పత్రాలను అమెరికా దర్యాప్తు ఏజెన్సీలకు అందజేసినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube