చనిపోయిన వ్యక్తి ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వానికే మస్కా: 55 ఏళ్ల జైలు శిక్ష

సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగుతున్నా.కేటుగాళ్లు ఓ అడుగు ముందుకే ఉంటున్నారు.

 Senegalese Man Convicted For Misusing Americans Id-TeluguStop.com

ఇందుకు వారు ఉపయోగిస్తున్న విధానాలు, ఆలోచనలే నిదర్శనం.సంతకాలను ఫోర్జరీ చేసే స్థాయి నుంచి ఓ వ్యక్తి వేలిముద్రల నమూనాలను తయారు చేసి కోట్ల రూపాయలను ఊడ్చేస్తున్నారు.

తాజాగా అమెరికాలో ఓ కేటుగాడు.చనిపోయిన వ్యక్తి ధ్రువీకరణ పత్రాల సాయంతో ప్రభుత్వానికే మస్కా కొట్టి లక్షలాది రూపాయల సాయం పొందాడు.

Telugu Senegalese, Telugu Nri Ups-

  వివరాల్లోకి వెళితే.లైల్ లిండ్‌సి అనే వ్యక్తి 1957లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.అయితే జూలై నెలలో లిండ్‌సి పేరుపై డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు వచ్చింది.అయితే రికార్డుల్లో అతను చనిపోయి ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి.విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో అల్మామీ బాబా లై అనే సెనెగల్ జాతీయుడు దాదాపు 31 సంవత్సరాల నుంచి లిండిసి ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లక్షలాది డాలర్ల లబ్ధి పొందాడు.
అలాగే విద్యార్ధినని చెప్పి 2012-19 మధ్య కాలంలో 80 వేల డాలర్ల విద్యా రుణాన్ని పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.అంతేకాకుండా ఇతనిపై గతంలోనే దోపిడి కేసులు, డ్రగ్స్ అమ్మకంతో పాటు అమెరికాలో అక్రమ నివాసం కింద పలు కేసులు ఉన్నాయి.

గురువారం అల్మామీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఇతని నేరాల చిట్టా విన్న న్యాయమూర్తి.

ఇది కోట్లాది మంది అమెరికా పౌరులను చేసిన మోసమే కాదని.ఒక కుటుంబం తన బిడ్డ ఇంకా బతికే ఉన్నాడని భావించేలా చేసిందని అభిప్రాయపడ్డారు.

సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో అల్మామీకి 55 ఏళ్ల జైలు శిక్షతో పాటు మిలియన్ డాలర్ల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.వచ్చే డిసెంబర్ నుంచి తీర్పు అమల్లోకి వస్తుందని న్యాయమూర్తి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube