3 నెలలుగా నదిలో ఉన్న ఐఫోన్ 12.. వర్కింగ్ కండిషన్‌లోనే ఉండటంతో!

ఐఫోన్లు చాలా క్వాలిటీ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు.వాటి నాణ్యత ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటుంది.

 The Iphone 12 Which Has Been In The River For 3 Months Is Still In Working Cond-TeluguStop.com

తాజాగా అవి ఎంత క్వాలిటీగా ఉంటాయో తెలిపే ఓ ఘటన జరిగింది.కాలిఫోర్నియా( Californi )లోని ఒక డైవర్ నది నీటిలో ఓ ఐఫోన్ 12ని చూశాడు.

దానిని బయటకు తీసి ఛార్జింగ్ పెట్టగా అది ఆన్ అయింది.దాంతో అతడు ఆశ్చర్యపోయాడు.

ఈ వ్యక్తి రీసెంట్ గా స్టానిస్లాస్ రివర్‌లో చెత్త, ఫిషింగ్ గేర్‌లను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ఫోన్‌ను కనుగొన్నట్లు యాపిల్ ఇన్‌సైడర్‌తో చెప్పాడు.

ఫోన్ ఆల్గేతో కవర్ అయి కొన్ని రాళ్ల మధ్య ఇరుక్కుపోయిందని అతడు తెలిపాడు.లీ( Lee) అని చెప్పుకునే ఈ డైవర్ నవంబర్ 10న ఫోన్‌ను పొందానని, కొన్ని రోజులు ఆరబెట్టడానికి వదిలేశానని చెప్పాడు.తరువాత అతను దానిని ఛార్జర్‌కి ప్లగ్ చేసి, అది ఆన్ కావడం చూసి ఆశ్చర్యపోయాడు.

ఫోన్‌లో పాస్‌కోడ్ లేనందున అతను ఫోటోలు, కాంటాక్ట్స్ కూడా యాక్సెస్ చేయగలిగాడు.అతను ఫోన్‌తో తీసిన చివరి ఫోటో తేదీని తనిఖీ చేసాడు, అది సెప్టెంబర్ 4న నది వీడియో.

అంటే ఫోన్ మూడు నెలలకు పైగా లేదా దాదాపు 100 రోజులు నీటిలోనే ఉందని అర్థం.ఫోన్ మన్నిక, వాటర్ రెసిస్టెన్స్ తనను ఆకట్టుకుందని లీ చెప్పారు.

ఐఫోన్ 12 యాపిల్( iPhone 12 Apple ) స్మార్ట్‌ఫోన్‌ల లేటెస్ట్ మోడళ్లలో ఒకటి, ఇది నీరు, ధూళి వల్ల మొబైల్ పాడుకాకుండా IP68 రేటింగ్‌తో వస్తుంది.దీనర్థం, అవి 6 మీటర్ల నీటిలో మునిగి 30 నిమిషాల వరకు పాడు కాకుండా ఉండగలవు.అయినప్పటికీ, అవి వాటర్‌ప్రూఫ్ అని దీని అర్థం కాదు, ఎందుకంటే నీరు ఫోన్ ఇంటర్నల్ పార్ట్స్‌ను కాలక్రమేణా దెబ్బతీస్తుంది.యాపిల్ దాని వారంటీ కింద వాటర్ డ్యామేజ్‌ను కవర్ చేయదు, కాబట్టి యూజర్లు తమ ఫోన్లను ద్రవపదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది.

అతను ఫోన్ యజమానిని సంప్రదించానని, ఆయన తన నిజాయితీ, దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపాడని లీ చెప్పారు.ఓనర్‌కు ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చానని, అయితే ఆయన అప్పటికే కొత్తది కొన్నారని లీ చెప్పాడు.

తన మంచి పనికి ప్రతిఫలంగా ఆ ఫోన్‌ని తననే ఉంచుకోమని యజమాని చెప్పాడని, ఈ ఫోన్ తన సొంతం అయినందుకు సంతోషంగా ఉందని అన్నాడు.తన కథ ఇతరులకు కూడా ఇలాగే స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

https://youtu.be/3gvY6qtVwG0
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube