మామూలుగా కొంతమంది ఇష్టం లేని పనులు అస్సలు చేయరు.అది తమకు నచ్చకపోతే మొత్తానికి వదిలేసుకుంటారు.
కానీ కొన్ని సందర్భాలలో ఇష్టం లేని పనులు కూడా చేయవలసి వస్తుంది.అది తమ కోసం కాకున్న ఇతరుల కోసం అయినా చేయాల్సి వస్తుంది.
అలా సామాన్యులే కాదు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు కూడా ఇష్టం లేకుంటే వదిలేసుకుంటారు.సందర్భం వస్తే అయిష్టాన్ని ఇష్టంగా కూడా మార్చుకుంటారు.
అటువంటి అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది హీరోయిన్ సదా.ఇంతకీ ఆమె ఏ విషయంలో ఇష్టం లేదని ఇష్టంగా చేయించుకుందో అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సదా( Sadha ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు హీరోయిన్ గా ఓ రేంజ్ లో సందడి చేసింది.
ఎక్కువగా లవ్ స్టోరీస్ తో అప్పటి కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.తొలిసారిగా సదా జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా తొలి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత నాగ, లీలా మహల్ సెంటర్, అవునన్నా కాదన్న, దొంగ దొంగది, అపరిచితుడు( Aparichitudu ), టక్కరి ఇలా పలు సినిమాల్లో నటించగా కొంతవరకు సక్సెస్ అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది.

ఇక యమలీల 2( Yamaleela 2 ) సినిమా తర్వాత మళ్లీ ఆమె అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.ఆ తర్వాత కొంతకాలానికి ఓ వెబ్ సిరీస్ లో అవకాశం అందుకుంది.ఇక బుల్లితెరపై అడుగుపెట్టి అక్కడ జడ్జిగా బాధ్యతలు చేపట్టింది.
ఇక కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు కూడా రాలేకపోతున్నాయని చెప్పాలి.సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

తనకు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోస్ బాగా పంచుకుంటుంది.తన ఫోటోలు కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తను అంతగా గ్లామర్ షో చేసినట్లు కనిపించదు.అయితే ఇదంతా పక్కన పెడితే ఈమెకు టాటూ వేయించుకోవడం అనేది అస్సలు ఇష్టం ఉండదట.

అయితే తాజాగా అది వేయించుకొని అది ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చింది.రీసెంట్ గా ఆమె ఒక టాటూ వేయించుకుంది.ఇక తనకు పిల్లి పిల్లలు అంటే ఇష్టమని.
దీంతో ఆమె పిల్లి పాదాలను గుర్తుగా వేసుకుంటూ నాలుగు రెమ్మలను టాటూగా వేయించుకుంది.ఇక ఆ పోస్ట్ షేర్ చేస్తూ.
తనకు టాటూ అంటే అసలు ఇష్టం ఉండదు అని.కానీ జీవితంలో కొన్ని కొన్ని సార్లు ఇష్టం లేనివి కూడా ఇష్టపడే పొజిషన్ కి వస్తాం అంటూ.ప్రజెంట్ తను అదే పొజిషన్ లో ఉన్నాను అని.ఈ టాటూ తనకు చాలా నచ్చిందని తెలిపింది.ప్రస్తుతం ఆమె టాటూ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







