ఏపీ సీఎం జగన్ తో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశం అయ్యారు.ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి సీఎంను ఆహ్వానించారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరగనుంది.అదేవిధంగా శ్రీశైలంలో జరగనున్న మహా కుంభాభిషేక మహోత్సవానికి కూడా సీఎం జగన్ ను డిప్యూటీ సీఎం కొట్టు ఆహ్వానించారు.
కాగా శ్రీశైలంలో ఈనెల 25 నుంచి 31 వరకు మహా రుద్ర శతచండీ వేద స్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.







