నాతో పెట్టుకుంటావా అని కుక్కను పరుగెత్తించిన కోడి... వైరల్

కుక్కకు కోడి అంటే బద్ద శత్రువు అని మనకు తెలిసిందే.ఎవరూ లేని ప్రదేశంలో కోడి గనుక కుక్కకు కనబడితే ఇక కోడి పని ఇక అయినట్టే.

 The Hen Who Ran The Dog To Ask If He Could Keep Up With Me Viral, Vial News , He-TeluguStop.com

అదే విధంగా మన ఇండ్లల్లో అంటే ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో అయితే కుక్కలను, కోళ్లను ఒకే దగ్గర పెంచుకుంటారు.కుక్క చిన్నగా ఉన్నప్పుడు, కోళ్లు చిన్నగా ఉంటాయి.

కాబట్టి వాటికి ఇవి మచ్చికగా అనిపించి ఏమీ చేయవు.అదే ఇక మామూలుగా మనం తీసుకుంటే కోడి కనబడితే ఎప్పుడు లాగిచ్చేద్దామా అని అనుకుంటుంది.

కాని ఓ చోట కుక్కకు కోడి భయపడలేదు సరికదా కుక్కను పరుగెత్తించింది.ఏంటి కుక్కను కోడి పరుగులెత్తించడం ఏంటి అని మీరు నమ్మడం లేదు కదా.అయితే మీరు ఇది తప్పక చదవాల్సిందే.ఒంటరిగా కోడి కనబడే సరికి ఇక కోడి పని పడదామని అనుకున్న కుక్కకు చేదు అనుభవం ఎదురయ్యింది.

నువ్వు నన్ను పట్టుకునేది ఏంటి నేనే నిన్ను పట్టుకుంటా నువ్వెంత నీ లెక్కేంత అనే రీతిలో కోడి కుక్కను భయపెట్టసాగింది.నా అరుపులకైనా భయపడుతుందనుకున్న కుక్క ఎంత గట్టిగా కోడివైపు అరిచినా కోడి ఎంతకూ బెదరకపోవడంతో ఇక తప్పని పరిస్థితులలో కుక్క వెనక్కి తగ్గింది.

కుక్క కాస్త వెనక్కి తగ్గడంతో రెచ్చిపోయిన కోడి ఇక కుక్కను పరుగెత్తించింది.ఈ వ్యవహారాన్ని అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో వదలడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తున్న కోడి కాన్ఫిడెన్స్ కు నెటిజన్లు సలాం చేస్తున్నారు.ఎంతో కామెడీగా ఉన్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం.

వీడియో చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube