Vizag Drugs Case : విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ నేతల హస్తం..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దఎత్తున డ్రగ్స్( Drugs ) పట్టుకోవడం సంచనలంగా మారింది.

విశాఖ తీరంలో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ లో భారీగా కొకైన్ దొరికింది.డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్ ను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.

ఇంటర్ పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు విశాఖ పోర్టులో( Visakha Port ) మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16 వ తేదీన విశాఖలోని సంధ్యా ఎక్స్ పోర్ట్స్ కు( Sandhya Exports ) కంటైనర్ వచ్చింది.

ఈ నెల 18న ఇంటర్ పోల్ కు ఈ-మెయిల్ ద్వారా సమాచారం రావడంతో.సీబీఐ రంగంలోకి దిగింది.

Advertisement

ఈ క్రమంలోనే ‘ ఆపరేషన్ గరుడ’( Operation Garuda ) పేరుతో ఇంటర్ పోల్, సీబీఐ మరియు కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ బ్యాగులను సీజ్ చేశారు.

అలాగే సంధ్యా ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించిన యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది.డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారంలో ఓ ప్రతిపక్ష పార్టీ నేత హస్తం ఉందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీ అడ్రస్ పేరు మీదుగా డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని, ఆ కంపెనీ టీడీపీకి( TDP ) చెందిన నేతదని టాక్ వినిపిస్తోంది.

డ్రగ్స్ కంటైనర్ వచ్చిన సంధ్యా ఎక్స్ పోర్ట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూనం వీరభద్రరావు, ( Kunam Veerabhadra Rao ) డైరెక్టర్ గా కూనం కోటయ్య చౌదరి ( Kunam Kotaiah Chowdary ) వ్యవహారిస్తున్నారని తెలుస్తోంది.అలాగే టీడీపీకి చెందిన నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలతో కోటయ్య చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.కాగా వీరిలో దామచర్ల సత్య టీడీపీ అధినేతకు అత్యంత ఆప్తుడన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

డ్రగ్స్ వ్యవహారంలో కీలక పార్టీ నేతలు హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు