ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది.డబ్బే ఏళ్ల వయస్సు లోనూ అధినేత చంద్రబాబు తన శక్తికి మించి కష్టపడుతూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
క్షణం తీరిక లేనట్లుగా బాబు నిత్యం పార్టీ వ్యవహారాల పైనే కసరత్తు చేస్తున్నారు.ప్రస్తుతం సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా బాబు పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు.
అక్కడి నుంచే వారికి సలహాలు సూచనలు ఇస్తూ, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు.అయితే బాబు పడుతున్న తాపత్రయాన్ని తెలుగు తమ్ముళ్లు మాత్రం అర్థం చేసుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.
పార్టీలో సీనియర్ నాయకులు అంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.పార్టీలో గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఆధిపత్య పోరు కనిపిస్తోంది.ప్రతి జిల్లాలోనూ నాయకుల వ్యవహార శైలి ఈ విధంగానే కనిపిస్తోంది.ఎక్కడా కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందించుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్లే విషయంలో నాయకులు చొరవతో చూపించడం లేదు.
కేవలం రాజకీయంగా తమకు మంచి పొజిషన్ వస్తే చాలు అన్నట్లుగానే నాయకుల వ్యవహారం కనిపిస్తోంది.కేవలం టిడిపి సీనియర్ నాయకులే కాదు, దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ , నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది.
కొంతమంది 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఇప్పుడు ఇదే రకమైన ఆధిపత్య పోరుతో సతమతమవుతున్నారు.
రోజురోజుకు ఈ గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ ఉండడం అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.
విశాఖ జిల్లాలో టిడిపికి ఎంతోమంది కీలక నాయకులు ఉన్నా, కేవలం అయ్యన్నపాత్రుడు మాత్రమే యాక్టివ్ గా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.అలాగే తూర్పుగోదావరి జిల్లాలోనూ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవాని వర్గాల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది.
అలాగే అనంతపురం జిల్లాలను జెసి దివాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వంటి వారి మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూ టిడిపిలో ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.
ఒకవైపు వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవడం బాబుకి ఇబ్బందికరంగా మారింది.