మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటులను అందం పరంగా చాలామంది రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు.ఎందుకంటే కెరీర్ మొదటికి ఇప్పటికీ వాళ్ళ అందంలో చాలా తేడాలు ఉంటాయి కాబట్టి.
వాళ్లను ప్లాస్టిక్ సర్జరీ ముఖాలు అంటూ బాగా అవమానిస్తూ ఉంటారు.నిజానికి చాలామంది హీరోయిన్లు కెరీర్ మొదట్లో ఉన్న రూపం పేరు.
ఇప్పుడున్న రూపం వేరు.కొంతమంది హీరోలు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.
అయితే తాజాగా హీరో మహేష్ బాబును కూడా ఒక అమ్మాయి ప్లాస్టిక్ సర్జరీనా అంటూ అవమానించింది.అయితే ఆ అమ్మాయికి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్( Mahesh Babu ).ఇక తన లుక్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమాన హీరోగా నిలిచాడు.తొలిసారిగా ఇండస్ట్రీకి బాల నటుడుగా పరిచయమై చిన్న వయసులోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్.చిన్నవయసులోనే ఎనిమిది సినిమాలకు పైగా నటించాడు.ఆ తర్వాత రాజకుమారుడు( Raja Kumarudu ) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఈ సినిమాలో తన నటనతో ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.అలా యువరాజు, వంశీ, మురారి, పోకిరి, అర్జున్ వంటి ఎన్నో సినిమాలు మహేష్ బాబు కు మంచి గుర్తింపును అందించాయి.ఎక్కువగా క్లాస్ సినిమాలకే మంచి ప్రాధాన్యం ఇస్తాడు మహేష్ బాబు.
ఇక కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ గా కూడా బాధ్యతలు వహించాడు.మహేష్ బాబు నటుడుగానే కాకుండా వ్యక్తిగతం పట్ల కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈయనకు సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది.ఇక మహేష్ బాబు తనతో కలిసి నటించిన నటి నమ్రతా శిరోద్కర్( Namrata Shirodkar )ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.నమ్రత మాజీ మిస్ ఇండియా గా కూడా నిలిచింది.ఈమె ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది.వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.మహేష్ బాబు సినిమా విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.
కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.
ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.పండగల సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలపటం, తన సినిమా గురించి అప్డేట్లు అందివ్వటం, అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడం వంటివి చేస్తూ ఉంటాడు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక ఫారిన్ స్పెషలిస్ట్ తో ఫోటో దిగగా ఆ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇక ఆ ఫోటో చూసి మహేష్ బాబును కూడా ఫారిన్ అబ్బాయిలా ఉన్నావు అంటూ అందరూ కామెంట్లు పెట్టగా ఓ అమ్మాయి మాత్రం మహేష్ బాబు డాక్టర్ తో ఉండటంతో మరోలా అనుకోని ఈ విధంగా కామెంట్ చేసింది.సర్జరీ చేశాడా? నువ్వు న్యాచురల్ అనుకున్న.ప్లాస్టిక్ అన్నమాట అంటూ మహేష్ బాబు లుక్ ను అవమానించింది.వెంటనే మిగతా నెటిజెన్స్.
ఏంటండీ అంత మాట అన్నారు అంటూ బాగా ఫీల్ అవుతున్నారు.