చిత్రపరిశ్రమను చంపొద్దు.. సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు సూచన

చిత్రపరిశ్రమను చంపొద్దు.సీఎం జగన్ కు ఎంపీ రఘురామ సూచన.

 The Film Industry Mp Raghuram Krishnaraja's Suggestion To Cm Jagan, Jagan, Mp R-TeluguStop.com

ఒక గంట పై ఉన్న కోపంతో చిత్ర పరిశ్రమ చంపొద్దని ముఖ్యమంత్రి జగన్ కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ పై కోపంతో సినిమా టిక్కెట్లు ధరలు తగ్గించారాని ఆరోపించారు.మన చేష్టలతో కొన్ని పరిశ్రమలను కూకటివేళ్లతో పెకిలిస్తున్నామని మండిపడ్డారు.

చిత్ర నిర్మాణ వ్యయం బాగా పెరిగిందని వివరించారు.నాణ్యతలేని మద్యం ధరను 4 రెట్లు పెంచి సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడమేమిటని ప్రశ్నించారు.

ఇప్పటికే ఆదాయం రాక రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాల్ మూతపడ్డాయని రుణాలు చెల్లించినవాటిని బ్యాంకులు వాటిని వేలం వేస్తున్నాయని వివరించారు.ఫలితంగా చిత్రపరిశ్రమ దానిపైన ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నటులే స్వయంగా మీ వద్దకు వచ్చి విజ్ఞప్తి చేయాలని కోరుకోవద్దని సూచించారు.తన పార్టీకి చెందిన పరిశ్రమ ముఖ్యుడు ఆదిశేషగిరిరావు, అగ్ర నటుడు చిరంజీవి, నాగార్జున తో పాటు దిల్ రాజు ను పిలిచి పరిశ్రమ అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రికి సూచించారు.ఎవరో ఆడిస్తే తన ఆడుతున్నానని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పేర్కొనడం సరికాదని ధ్వజమెత్తారు.151 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆడిస్తే అడుతానని.23 మంది ఎమ్మెల్యేలున్న మాజీ ముఖ్యమంత్రి ఆడిస్తే ఎందుకు ఆడతానని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube