త‌న ట్యాలెంట్‌ను వీడియో ద్వారా తెల‌పాల‌నుకున్న మ‌హిళా పోలీస్‌.. కానీ..

ప్ర‌స్తుతం అంతా కూడా సోస‌ల్ మీడియాదే హ‌వా కొన‌సాగుతోంది.

దీంతో అంద‌రూ కూడా ఏదో ఒక విధంగా వీడియో తీసి త‌మ ట్యాలెంట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా నిరూపించుకోవాల‌ని భావిస్తున్నారు.

ఈ కార‌ణంగానే చాలా మంది ఏదో ఒక ప్ర‌య‌త్నం చేసి స్టార్లు అయిపోతున్నారు.ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఈజీగానే పాపులారిటీని సంపాదించుకోవ‌డంలో భాగంగా ఈ మ‌ధ్య ప్ర‌భుత్వ జాబులు చేస్తున్న వారు కూడా ఇలాగే ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ప్ర‌భుత్వ ఆఫీస‌ర్లు ఇలాంటి వీడియోలు తీసే క్ర‌మంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.ఏ మాత్రం పొర‌పాటు జ‌రిగినా చివ‌ర‌కు ఉద్యోగానికి ఎస‌లు వ‌స్తుంది.

ఇప్పుడు కూడా ఇలాగే ఓ మహిళా కానిస్టేబుల్ త‌న ట్యాలెంట్ ఏంటో నిరూపించుకోవాల‌ని అనుకుంది.కాగా ఈ క్ర‌మంలోనే ఆమె సరదాగా ఓ వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌టంతో అది కాస్తా ఈజీగానే వైరల్ అయిపోయింది.

Advertisement

ఇంకేముంది ఆమె కాస్తా వివాదంలోకి కూరుకుపోయారు.ఇప్పుడు ఆమె చేసిన వీడియో కాస్తా ఉన్నతాధికారుల దాకా వెళ్ల‌డంతో వారు చూసి ఆమెపై విచార‌ణ చేసి చర్యలకు ఆదేశించారు.

ఇక్క‌డే ఆమె చేసిన పెద్ద తప్పేంటి అని తెలుసుకోవాల‌ని ఉందా.

అయితే ఈమె పేరు ప్రియాంక మిశ్రా, ఈమె ఆగ్రాలోని ఓ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వ‌హిస్తోంది.కాగా ఆమె డ్యూటీలో ఉండ‌గానే ఖాకీ డ్రెస్ లో పైగా త‌న డ్యూటీ తుపాకీని చేతిలో ప‌ట్టి మ‌రీ ఒక డైలాగు చెప్పి దానికి త‌గ్గ‌ట్టుగా లిప్ సింక్ చేయ‌డంతో అది కాస్తా ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.అయితే ఆమె చెప్పిన డైలాగులో నేరాలకు అడ్డాగా హర్యానా పంజాబ్ లఉన్నాయ‌ని, అయితే త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే ఐదేళ్ల పిల్లలకు కూడా తుఫాకీలు వాడటం తెలుసంటూ చెప్ప‌డం ఇక్క‌డ పెద్ద దుమారం రేపుతోంది.

బాధ్యత కలిగిన పోలీసు ఇలా చేస్తారా అంటూ చ‌ర్య‌లకు ఆదేశించారు.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)
Advertisement

తాజా వార్తలు