అప్పుడప్పుడు సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు తమ ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టాలని ఆశ పడుతుంటారు.తమ గురించి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని వాళ్లతో కాసేపు చిట్ చాట్ చేస్తూ ఉంటారు.
ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటారు.ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే వెంటనే ఫైర్ అవుతూ ఉంటారు.
అయితే తాజాగా రీతూ చౌదరి( Ritu Chaudhary ) కూడా తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెట్టింది.దీంతో తన ఫ్యాన్ తనకు మ్యారేజ్ ప్రపోజల్( Marriage Proposal ) చేయటంతో ఈ బ్యూటీ వెంటనే ఒక రిప్లై తో షాక్ ఇచ్చింది.
ఇంతకు ఆమె ఏమని ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు బుల్లితెరకు చెందిన సీరియల్ నటి, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి అందరికీ బాగా పరిచయం అయింది.
మొదట్లో టిక్ టాక్ వీడియోలు( Tik tak Videos ) చేస్తూ అందరి దృష్టిలో పడి మంచి అభిమానం సంపాదించుకుంది.ఆ తర్వాత కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.
అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం రావడంతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.
ఇక ఓసారి కామెడీ షో జబర్దస్త్( Comedy show Jabardast ) లో గెస్ట్ గా అడుగుపెట్టింది.ఇక తొలిచూపులతో జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.
జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.
సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే సరదాగా తనకు ఖాళీ సమయం దొరకడంతో.తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది.
అయితే ఓ నెటిజన్ నిన్ను పెళ్లి చేసుకుంటాను.మీ నాన్న లాగా చూసుకుంటాను లవ్ యు అని ప్రపోజ్ చేయడంతో.వెంటనే రీతూ ఏమాత్రం కోప్పడకుండా.అవ్వ్.థాంక్స్ ఫర్ యువర్ లవ్ అంటూ లవ్ సింబల్ తో స్పందించింది.దీంతో అది చూసి జనాలు అయితే అతగాడికి ఓకే అన్నట్లేనా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఆ మధ్యనే రీతూ తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే.







