ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు వెనుక ఆ ఎన్నికల ఎఫెక్ట్ ? 

జగన్( CM ys jagan ) చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం ఆయన పార్టీ వైసీపీలో పెద్ద కల్లోలమే సృష్టిస్తోంది.దాదాపు 90 నియోజకవర్గాల్లో సెట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చి వారి స్థానం కొత్తవారిని నియమించేందుకు జగన్ కసరత్తు మొదలుపెట్టారు ఇప్పటికే కొంతమందికి నియోజకవర్గాలను మార్చడం, మరికొంతమందికి ఇటు నిరాకరించడం వంటివి చోటు చేసుకున్నాయి.

 The Election Effect Behind The Change Of Mla Candidates , Jagan, Ysrcp, Brs Part-TeluguStop.com

జనవరి రెండో తేదీన రెండో విడత కొత్త ఇంచార్జిల జాబితా విడుదల కానుంది.అయితే ఒక్కసారిగా ఈ భారీ ప్రక్షాళనకు జగన్ దిగడంతో, టికెట్ దక్కే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది.

కొంతమంది బహిరంగంగానే ఆందోళనలకు దిగగా, మరికొంతమంది ఇతర పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Telugu Ap, Brs, Jagan, Telangana, Ys Jagan, Ysrcp, Ysrcp Mlas-Politics

జగన్ ఒక్కసారిగా ఈ భారీ ప్రక్షాళనకు దిగడం పార్టీకి నష్టమే అయినా, జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్( BRS party ) ఓటమి చెందడమే ప్రధాన కారణం.సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వారిని మార్చకుండా మళ్లీ వారికే టికెట్ ఇవ్వడం అనే విషయాన్ని జగన్ గుర్తించారు.ఎమ్మెల్యేలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత పార్టీ పై పడిందని, కేసిఆర్( CM KCR ) మొహమాటం పడి టికెట్లు ఇవ్వడం, జనాల్లో వ్యతిరేకత ఉందని సర్వే నివేదికలు వచ్చినా పట్టించుకోకుండా మళ్ళీ వారికే టికెట్ ఇవ్వడం, బీఆర్ఎస్ ఓటమికి కారణం అయిందని జగన్ గుర్తించారు.

అక్కడ కొంతమంది అభ్యర్థులను మార్చి, కొత్త వారికి టికెట్ ఇవ్వడంతోనే గెలుపు సాధ్యం అయ్యిందని నమ్ముతున్నారు.

Telugu Ap, Brs, Jagan, Telangana, Ys Jagan, Ysrcp, Ysrcp Mlas-Politics

అందుకే రెండోసారి వైసీపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా సెగ్మెంట్ లను మార్చడమే మంచిదనే నిర్ణయానికి జగన్ వచ్చారట.అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది అలక చెందినా, ఈ భారీ మార్పులు చేపట్టే విషయంలో జగన్ వెనుకాడడం లేదు.తనకు మళ్లీ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని, ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు.

అందుకే అన్ని పార్టీల కంటే ముందుగానే టికెట్ల రచ్చ కు తెర తీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube