దుబాయ్ నగరంలో ఉపాధికోసం ఎంతో మంది భారతీయులు అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కూడా అయితే ఒక భారతీయ వ్యక్తి మాత్రం అక్కడ మహిళపై లైంఘిక దాడి పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
వివరాలలోకి వెళ్తే.
యూఏఈలోని దుబాయ్ నగరంలో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్న ఓ భారతీయ యువకుడు.ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.ఫిలిప్పైన్స్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ ఆగష్టు 3న రాత్రి 1:20 గంటల సమయంలో తన స్నేహితురాలితో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కొంతమంది వ్యక్తులలో ఒకడు మహిళను వేధించాడు.చేయి పట్టుకుని ఆమెను తనవైపు బలవంతంగా లాగాడు…ఎంతో క్రూరంగా ప్రవర్తించాడు.
అయితే కొద్ది సేపటి తరువాత ఆ మహిళని వదిలేసాడు దాంతో ఆమె అతడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అరుస్తూ కొంతదూరం వెంటబడింది.అటుగా వస్తున్న ఓ ఆఫ్రికన్ వ్యక్తి సహాయంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకి సమాచారం అందించింది.పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు కేసు తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారని పోలీసులు తెలిపారు.