అప్పుడప్పుడు పోలీసులు కొన్ని కేసులకు సంబంధించి వివరాలు సేకరించడం కోసం స్నైపర్ డాగ్స్ ఉపయోగించినట్లు మనం వింటూనే ఉంటాం.ఇలాంటి స్నైపర్ డాగ్స్ ఏదైనా కేసులో నిందితులను పట్టుకోవడానికి ఎంతగానో కీలకపాత్ర వహిస్తాయి.
ఎక్కడైనా బాంబు లాంటి వాటిని కనిపెట్టడానికి అయినా సరే.లేకపోతే ఏదైనా మర్డర్ జరిగిన సమయంలో నిందితుడు వివరాలు గుర్తించాలి అనుకున్నప్పుడు ఈ పోలీస్ డాగ్స్ ను ఉపయోగిస్తారు.ఈ కుక్క లకు స్పెషల్ ట్రైనింగ్ ను పోలీస్ అధికారులు అందిస్తారు.ఇక అసలు విషయంలోకి వెళితే.పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎంతగానో సహకరించిన స్నైపర్ డాగ్ కు ఓ అరుదైన గౌరవం లభించింది.
రూబీ అనే పేరు గల స్నైపర్ డాగ్ ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖకు చెందినది.
ఈ కుక్క తాజాగా ఓ కేసు ఛేదనలో కీలక పాత్ర వహించింది.ఇందుకుగాను ఆ కుక్కకు ‘కాప్ ఆఫ్ ది మంత్’ అని అవార్డును ప్రకటించింది పోలీస్ శాఖ.
ఇలా ఒక కుక్కకు అవార్డును ప్రకటించడం ఇదే మొట్టమొదటిసారి.దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతేకాదు ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ వివరాలను వెల్లడించింది.
ఆ కుక్క చేసే విన్యాసాలకు సంబంధించి ఫోటోలు కూడా అందులో పొందుపరిచింది.ఛత్తీస్‌గఢ్ లోని రాయగడ్ జిల్లాలో ఎన్నో ముఖ్యమైన కేసుల వివరాలను కనుగొనేందుకు ఈ కుక్క పోలీసులకు ఎంతో సహాయం చేసింది.ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరాన్ గఢ్ రాయల్ ప్యాలెస్ లో జరిగిన చోరీ కేసును కూడా ఈ కుక్క సహాయంతోనే పోలీసులు చేధించారు.
అందుకే ఈ నెలకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆ కుక్కకు కాప్ ఆఫ్ ది మంత్ గా ప్రకటించారు.ఇందుకు సంబంధించి తాజాగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.
మంచిగా పని చేసే పోలీస్ సిబ్బందిని తాము ప్రతి నెల ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలా వారి ఫోటోలను పోలీస్ స్టేషన్స్ లో ఏర్పాటు చేయడంతో పాటు వారికి నగదు ప్రోత్సాహకాలు అందచేస్తునట్లు అధికారులు వెల్లడించారు.ఇకపోతే ఈ నెల ఈ ప్రోత్సాహం ఇద్దరికి లభించిందని అందులో ఒకరు లీగల్ సెక్షన్ ఆఫీసర్ కాగా మరొకరు డాగ్ హాండ్లర్.
వీటితోపాటు స్నైపర్ డాగ్ కు కూడా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.