కాంగ్రెస్ పార్టీనే దిక్కా..?

దేశ రాజకీయలో సుధీర్ఘ కాలం రాజకీయ( political ) అనుభవం కలిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీనే ( Congress party )అని చెప్పక తప్పదు.

మరి అలాంటి పార్టీ ఇప్పుడు నిర్వీర్యం అవుతున్న పార్టీలకు నిలయంగా మారుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు 2009 ఎన్నికలో పరాజయం తరువాత సినీ నటుడు చిరంజీవి( Chiranjeevi ) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన సంగతి తెలిసిందే.ఆ ఎన్నికల ముందు ఏపీలో ప్రజారాజ్యం పార్టీ ( Praja Rajyam Party )చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

కానీ 2009 ఎన్నికల్లో కేవలం 18 సీట్లు మాత్రమే కైవసం చేసుకోవడం, ఆ తరువాత పార్టీలో కూడా అంతర్మధనం ఏర్పడడంతో వేరే దారి లేక కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు అధినేత చిరంజీవి.

ఇక ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ ( YSR Telangana )పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) ఆశయ సాధన కోసమని తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ స్థాపించిన షర్మిల వచ్చే ఎన్నికల్లో పార్టీ నిలదొక్కుకోవడం కష్టమని భావించి కాంగ్రెస్ లో చేసేందుకు సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదే గనుక జరిగితే మరో పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయినట్లే.

Advertisement

ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ.కాంగ్రెస్ పార్టీనే దిక్కుగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఆ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ ( NCP Ajit Pawar )కారణంగా చీలిక ఏర్పడింది.

ఫలితంగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.ఈ నేపథ్యంలో బలహీన పడుతున్న ఎన్సీపీని అధినేత శరత్ పవార్ కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇదే గనుక జరిగితే కాంగ్రెస్ కు మరింత బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఒకవేళ ఎన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అయితే శరత్ పవార్ కుమార్తె సుప్రియ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది.మొత్తానిని నిర్వీర్యం అవుతున్న పార్టీలకు హస్తం పార్టీ నిలయంగా మారుతుందని చెప్పక తప్పదు.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు