యువ‌తికి ద‌డ పుట్టించిన మొసలి.. అస‌లు విష‌యం తెలిస్తే న‌వ్వాల్సిందే..!

ఏదైనా సీరియస్ పనిలో పడి మనం దారి వెంట వెళ్తున్న సమయంలో ఒక్కోసారి ఎదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోం.

మనుషులు, జంతువులు ఎవరు వచ్చినా వారిని పట్టించుకోకుండానే వెళ్లే ప్రయత్నం చేస్తాం.

ఓన్లీ అవి మనల్ని అడ్డుకున్నప్పుడే అది ఏంటి? అని పరిశీలిస్తాం.ఒకవేళ మీరు దారిలో వెళ్తున్న క్రమంలో మీకు క్రూర జంతువు మొసలి ఎదురుగా వస్తే ఏం చేస్తారు? తీవ్రంగా భయపడిపోయి వెంటనే పారిపోతారు కదా.అయితే, ఇక్కడే ఓ ట్విస్టుంది.ఓ యువతికి మొసలి ఎదురు అయింది.

కానీ, ఎదురు కాగానే ఆమె చేసిన పని ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు? ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది.అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని చదివి తీరాల్సిందే.

కొలంబియాలో ఓ యువతి తన పని నిమిత్తం తన ఇంటి నుంచి బయటకు వచ్చి స్పీడ్‌గా నడుచుకుంటూ వెళ్తుంది.ఈ క్రమంలో ఆమెకు సడెన్‌గా మొసలి ఎదురైంది.

Advertisement

ఒక్కసారిగా హడలిపోయిన ఆమె వెంటనే భయంతో దూరంగా పరుగులు తీసింది.అంతటితో ఆగకుండా పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసి పిలిపించింది.

అయితే, అది నిజమైన మొసలినా? ఉట్టి బొమ్మనా? అనేది పరిశీలించలేదామె.ఈ నేపథ్యంలోనే సదరు మహిళను రక్షించేందుకు పోలీసులు వచ్చారు.

అది నిజమైన మొసలి కాదని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం వారికి పోలీసులు రావడానికి కొంచెం ముందుగానే తెలిసింది.

భవనం బయట మెట్ల కింద నుంచి మొసలి వచ్చినట్లు మహిళ భావించింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అయితే, అక్కడకు వెళ్లి చూడగా, మొసలి ఉంది.కానీ, అది బొమ్మ ముసలి.కాగా, పోలీసులు అది ఉట్టి బొమ్మ అని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

ఈ ఫేక్ ముసలి ఫొటోను పోలీస్ ఆఫీసర్ జాసన్ డౌసెట్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.దాంతో పాటు జరిగిన సంఘటన గురించి వివరించాడు.అది చూసి నెటిజనాలు వెరీ ఫన్నీ ఇన్సిండెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

పాపం ఆ మహిళ పరిస్థితి ఏంటో అని పోస్టులు పెడుతున్నారు.

తాజా వార్తలు