కాంగ్రెస్ పార్టీతో పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటుపై సీపీఐ నేతలు కీలక భేటీ నిర్వహించారు.ఈ మేరకు హైదరాబాద్ లో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ కేటాయించిన సీట్లపై వాడీ వేడి చర్చ సాగిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గ సీటుపై కూనంనేనికి, పల్లా వెంకట్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని సమాచారం.
అదేవిధంగా సీపీఐ అడిగిన బెల్లంపల్లి, మునుగోడు, కొత్తగూడెం, వైరా, హుజూరాబాద్ సీట్లలో మునుగోడుకు కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే.