ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నుండి క్లారిటీ రాని విషయం మనకు తెలిసిందే.
అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందు వరకు హుజురాబాద్ ఉప ఎన్నిక పట్ల కాంగ్రెస్ స్పందించలేదు.అయితే బీజేపీకి మద్దతిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికి అవి అసత్య ప్రచారాలేనని అర్ధమవుతుంది.
ఎందుకంటే హుజూరాబాద్ లో కాంగ్రెస్ చాలా వరకు ఓటు బ్యాంకు ఉంది.అప్పట్లో ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఈటెలకు ప్రత్యర్థిగా పోటీ చేసి ఏకంగా ఈటెల రాజేందర్ ఓడిపోతాడేమో అన్న రీతిలో కాంగ్రెస్ ప్రభావం చూపింది.
కానీ ప్రస్తుతం ఒకప్పటి కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు ధీటైన అభ్యర్థి కరువైన పరిస్థితి ఉంది.

అయితే ఈ అభ్యర్థిని కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం టీఆర్ఎస్ ను అనుసరిస్తోంది.అయితే ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు.అయితే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మొదట కొండా సురేఖను అనుకున్నా పోటీ చేయడానికి కొండా సురేఖ ఆసక్తి చూపించకపోవడంతో ప్రస్తుతం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బల్మూరి వెంకట్ ను హుజూరాబాద్ అభ్యర్థిగా ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే ఇద్దరు యువ అధ్యక్షులే కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ పోరుకు తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేరినట్టు అయింది, ఏది ఏమైనా హుజూరాబాద్ లో జరగనున్న త్రిమఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.