క్రిస్మస్ పండుగ( Christmas festival ) సమీపిస్తోంది.చాలామంది ప్రజలు తమ ఇళ్లను డెకరేట్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా క్రిస్మస్ ట్రీ కొనుగోలు చేసి ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొని, దానిని మరింత అందంగా డెకరేట్ చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఆ వీడియోలో క్రిస్మస్ ట్రీకి మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి.కొందరు పార్టీ మూడ్‌లో ఉండి కాకర వత్తుల వంటివి కాలుస్తుండగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఆ చెట్టు కాస్త పెద్దగానే ఉంది.దానిని బయటికి తీసుకెళ్లడానికి వీళ్లు ట్రై చేశారు కానీ అది ఊహించని విధంగా గుమ్మంలో ఇరుక్కుపోయింది.అగ్ని ప్రమాదం( fire hazard ) నుంచి బయటపడడానికి ఉన్న ఆ ఒక్క ఎంట్రెన్స్ కూడా క్లోజ్ అయిపోవడంతో అక్కడ ఉన్నవారికి చెమటలు పట్టేసాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే కొంతమంది యువతీ యువకులు కలిసి పార్టీ చేసుకోవడం మనం చూడవచ్చు.వారు ఫైర్ క్రాకర్స్ వెలిగించి, ఒక పాట ప్లే చేస్తూ డాన్సులు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఒక ఫైర్ స్పార్క్ క్రిస్మస్ ట్రీ పై పడింది.అంతే దానికి మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి.దానిపై ఒక గ్లాసు నీళ్లు పోసినా సరే మంటలు ఆరలేదు.ఇంట్లో మంట పెద్దదయింది.పొగ కూడా కమ్మేసింది.దాంతో భయపడిన కొందరు యువకులు దానిని బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే సరిగ్గా అది గుమ్మంలో ఇరుక్కుంది.మంట ఇంకా పెద్దదయింది.
దానితో వారు బిగ్గరగా భయంతో అరవడం వినిపించింది.ఇంతటితో వీడియో ముగిసింది.
తర్వాత ఏం జరిగిందని వివరాలు తెలియ రాలేదు.ఈ వీడియోకు ఇప్పటికే రెండు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
వీరు తెలివి తక్కువ వారని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.







