త‌ల్లి కోసం దొంగ‌ను చిత‌క్కొట్టేసిన చిన్నారి.. ధైర్యం పెద్ద‌దే

త‌ల్లి ప్రేమ ముందు ఇంకేదీ స‌రితూగ‌దు క‌దా.

మ‌రి ఎప్పుడూ బిడ్డకు ఆప‌ద వ‌చ్చినా త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడే త‌ల్లికి ఆప‌ద వ‌స్తే పిల్ల‌ల హృద‌యం అదే స్థాయిలో త‌ల్ల‌డిల్లిపోతుంది.

త‌ల్లి కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు.ఈ కాలంలో కొంద‌రు త‌ల్లిని వృద్ధాప్యంలో వ‌దిలేస్తున్న వారిని కూడా చూస్తున్నాం.

ఇంకొన్ని సార్లు త‌ల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న వారిని కూడా చూస్తున్నాం.అయితే ఇప్పుడు కూడా ఓ చిన్నారి కూడా త‌న త‌ల్లి కోసం పెద్ద సాహ‌స‌మే చేసింది.

ఏకంగా దొంగ‌తో క‌ల‌బ‌డి మరీ త‌ల్లిని కాపాడుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో నట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఆ చిన్నారి సాహ‌సాన్ని చూసిన వారంతా వావ్ అంటూ కొనియాడుతున్నారు.మ‌రి ఆ వైర‌ల్ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియోలో ఘ‌ట‌న అమెరికాలోని ఫ్లోరిడా ప‌ట్ట‌ణంలో చోటుచేసుకుంది.ఇందులో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి అమ్మ‌తో పాటు కిరాణా దుకాణానికి వ‌చ్చింది.

అయితే అక్క‌డే మ‌కాం వేసిన ఓ దొంగ చిన్నారి తల్లి వ‌ద్ద ఉన్న పర్సును ఎత్తుకుని ప‌రిగెత్తేందుకు ప్ర‌య‌త్నిస్తాడు.

అయితే ఆ మ‌హిళ‌ తేరుకుని అత‌న్ని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.దీంతో ఆ దొంగ ఆమెను కింద ప‌డేసి ప‌రిగెత్తే క్ర‌మంలో శివంగిలా ఆ చిన్నారి దొంగ మీద దాడి చేస్తుంది.పిడిగుద్దులతో దుమ్ము దులిపేస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

ఇక చేసేది లేక ఆ దుండ‌గుడు ప‌ర్సును అక్క‌డే వ‌దిలేసి పారిపోతాడు.ఇక ఇదంతా కూడా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కాగా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Advertisement

దీన్ని చూసిన నెటిజ‌న్లు చిన్నారి ధైర్యానికి తెగ మెచ్చుకుంటున్నారు.ఇలాంటి డేరింగ్ నెస్ అంద‌రికీ ఉండాలంటూ కోరుతున్నారు.

మ‌రి మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు