ఐదేళ్ల లోపు చిన్నారులకు అందించే పల్స్ పోలియో టీకా( Pulse Polio ) కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయినట్లు తెలుస్తోంది.గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పోలియో టీకా( Polio drops ) కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వాలు 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మళ్లీ ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు.
పోలియోను తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం( Central Govt ) గతంలో నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండేది.అందుకు తగినట్లుగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేవి.
ఈ క్రమంలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ను విజయవంతం చేయాలని, పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేసేందుకు పోలియోను తరిమి కొట్టాలని సూచించే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది.? పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 15 నెలలు కావొస్తున్నా ఇంతవరకు పల్స్ పోలియోను చేపట్టలేదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
అయితే మరోవైపు చిన్నారుల భవిష్యత్ ను అంధకారం చేసే విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలియో చుక్కలు వేయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.