Sneha : ఆడపిల్లనని ముఖమే చూడలేదు.. అన్నయ్య ఇబ్బంది పెట్టాడు.. స్నేహ సంచలన వ్యాఖ్యలు!

ఒకప్పటి తెలుగు సినీ నటి, స్నేహ ( Sneha )గురించి మనందరికి తెలిసిందే.తెలుగులో స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Heroine Sneha Recalls How She Was Discriminated Home-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.మొదట తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ ఆ తరువాత ప్రియమైన నీకు( Priyamaina Neeku ), శ్రీరామదాసు( Sri Ramadasu ), సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది.ఈమె త నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపింది.

తన తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులని, కూతుర్లలో తాను చివరి దానినని, తనకు బదులు కొడుకు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకుందని దీంతో ఆమె తన ముఖాన్ని చూడటానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని తెలిపింది స్నేహా.

ఇక చిన్నతనంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా వాటిని సోదరులకు తామే అందించాల్సి వచ్చేదని, అదేమని ప్రశ్నిస్తే మేం మగాళ్లం.ఆడపిల్లలైన మీరే ఇంటి పనులు చేయాలని కండీషన్లు పెట్టేవారని తెలిపింది.ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టేవాడని, అన్ని పనులు తననే చేయమని ఆదేశించేవాడు అంటూ తన బాధను పంచుకుంది స్నేహ.

ఇకపోతే ప్రస్తుతం ఈమె ఆడప దడపాల్సిన సినిమాలలో నటిస్తూనే తన భర్తతో కలిసి పలు రకాల కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube