సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది.చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్యకు గురయ్యారు.
ఉదయం వాకింగ్ వెళ్లి వస్తుండగా మల్లేశంపై గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.కాగా ఈ దాడిలో మల్లేశం తలకు తీవ్రగాయాలు అయ్యాయి.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మల్లేశం మృతి చెందాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
అదేవిధంగా హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.