ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్య‌త ప్రియుడిదే.. కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒక అమ్మాయి బాధ్య‌త ఎవ‌రికి అంటే ఏం చెబుతాం.హా ఇంకేముంది త‌ల్లిదండ్రుల‌ది, పెండ్లి అయ్యాక భ‌ర్త‌ది అంటారు క‌దా.

అవున‌నుకోండి మ‌రి ఈ మ‌ధ్య‌లో ఆమె ప్రేమ‌లో ప్రియుడి ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు ఏమైనా జ‌రిగితే దానికి ఎవ‌రు బాధ్య‌లు అంటే చెప్ప‌లేమ‌నే క‌దా మీ ఆన్స‌ర్‌.అయితే దీనికి ఇప్పుడు ఆన్స‌ర్ దొరికేసింది.

కోర్టు క‌రెక్టు ఆన్స‌ర్ చెప్పేసింది.ఒక అమ్మాయిని ప్రియుడు బయటకి తీసుకెళ్లే గ‌న‌క ఆమె భాద్యతను పూర్తిగా తీసుకోవాల్సిందే న‌ని స్ప‌ష్టం చేసింది.

ఆమెకు ఏమైనా జ‌రిగినా అత‌నిదే పూర్తి బాధ్య‌త అంటూ చెప్పుకొచ్చింది.ఇదే విష‌యంపై అలహాబాద్ హైకోర్టు ఈ విధంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Advertisement

రీసెంట్ గా యూపీలోని కౌశాంబి జిల్లాల నివ‌సిస్తున్న‌టువంటి బాలిక‌ను ఆమె ప్రియుడు చెరువు ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి ఇద్ద‌రూ అక్క‌డ కొద్దిసేపు గ‌డిపారు.అయితే అక్క‌డ‌కు స‌డెన్ గా ముగ్గురు వచ్చి అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డారు.

రాజుని బంధించి ఆ బాలిక మీద విచ‌క్ష‌ణా ర‌హితంగా అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు.దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా.

ప్రియుడు రాజుతో పాటు మిగ‌తా ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కాగా రాజు త‌న‌కు సంబంధం లేద‌ని త‌న‌ను విడిచిపెట్టాల‌ని పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

ఈ పిటిష‌న్ మీద విచారిస్తున్న సంద‌ర్భంగా ఈ విధంగా కోర్టు వ్యాఖ్యానించింది.రాజు ముందే త‌న ప్రియురాలి మీద ఆ ముగ్గురు అత్యాచారానికి ఒడిగ‌ట్టితే క‌నీసం అడ్డుకోలేద‌ని కాపాడే ప్రయత్నం కూడా చేయ‌లేద‌ని కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

రాజు అలా ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌డం త‌మ‌కు అనుమానంగా ఉందంటూ వ్యాఖ్యానించింది.అంతే కాదు ఇలాంటి స‌మ‌యాల్లో త‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చిన ప్రియురాలి గౌర‌వ‌, మ‌ర్యాద‌లు కాపాడాల్సిన బాధ్య‌త ప్రియుడిపై ఉందంటూ తెలిపింది.

Advertisement

అత‌నికి బెయిల్ ఇవ్వ‌డానికి కోర్టు నో చెప్పేసింది.

తాజా వార్తలు