కీలక ఆదేశాలు జారీ చేసిన బాంబే హైకోర్టు.. హోం మంత్రి పై సీబీఐ విచారణ.. ?

గత కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్,‌ బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు టార్గెట్ పెట్టరని పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే.కాగా ఈ ఆరోపణలు మహారాష్ట్ర ప్రభుత్వంలో కలకలం సృష్టించాయి.

 Bombay High Court Directs Cbi To Conduct Preliminary Inquiry On Allegations Agai-TeluguStop.com

ఇక బీజేపీ అయితే ఏకంగా హోంమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ కూడా చేసింది.

ఇదే సమయంలో పరమ్‌బీర్‌ తొలుత హోంమంత్రి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది.

దీంతో ప్రస్తుతం హోంమంత్రి ‌పై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించింది.

ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తిచేయాలని కూడా స్పష్టం చేసింది.

ఈమేరకు పోలీస్ అధికారి పరమ్‌బీర్ సింగ్‌‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మంత్రిపై ఆరోపణల విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది.

ఏది ఏమైన చట్టం తనపని తాను చేసుకుంటు వెళ్లుతుందని ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదంటూ ఘాటుగా స్పందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube