కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ?

కేంద్ర అధికార పార్టీ బీజేపీ లో శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కాస్త కంగారు పడుతున్న బీజేపి, అతి త్వరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దీనికి అనుగుణంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.అయితే కొత్త మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి ? ఏ ఏ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ? ఇలా అనేక అంశాలపై కసరత్తు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఏపీకి సంబంధించి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

టిడిపి నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తున్నా, ఆయన వల్ల రాష్ట్రస్థాయిలో పార్టీకి ఊపు వచ్చే అవకాశం లేదనేది బిజెపి పెద్ద అభిప్రాయంగా తెలుస్తోంది.అయితే బిజెపి తరఫున లోక్ సభ ఎంపీ ఒక్కరు కూడా లేరు.కేవలం రాజ్యసభ కోటలో జీవీఎల్ నరసింహారావు ఒక్కరే ఉన్నారు.2024 నాటికి బలం పుంజుకోవాలి అని చూస్తున్న బీజేపీ తప్పనిసరిగా ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నే బీజేపీకి ఊపు వస్తుందనే విషయాన్ని బలంగా నమ్ముతోంది.సుజనా చౌదరి,  జీవీఎల్ నరసింహారావు , దగ్గుబాటి పురంధరేశ్వరి వంటి వారి పేర్లు ఒకవైపు వినిపిస్తున్న , బలమైన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర స్థాయి లో ప్రభావం చూపించగల వారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అనే  అభిప్రాయంతో బీజేపీ ఉంది.

దీనిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు కేంద్ర బీజేపీ పెద్దలు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.జనసేన ద్వారానే బిజెపికి ఏపీలో బలం పెరుగుతుంది అని బిజెపి పెద్దలు నమ్ముతున్నారు.

Advertisement

దీనికితోడు లక్షలాది మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు తమకు కలిసి వస్తారని , మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిజెపి గ్రాఫ్ మరింత పెంచేలా ఆయన ఏపీలో ప్రచారం నిర్వహిస్తారని,  ఆ ప్రభావంతో 2024 ఎన్నికల్లో తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం వైసిపి ఏపీలో బలంగా ఉంది.

  ఆ పార్టీపై తెలుగుదేశం పార్టీ  విమర్శలు చేస్తున్న జగన్ మీద ద్వేషం తో చేస్తున్న విమర్శలు గానే జనాల్లోకి వెళ్తున్నాయి.కానీ పవన్ చేసే విమర్శలకు మాత్రం ఊహించని విధంగా స్పందన వస్తోంది.ఇదే విషయాన్ని గుర్తించిన బీజేపీ పవన్ కు కేంద్ర మంత్రి పదవి గా అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతోంది.

ఇప్పటికే ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరించే ఓ నేత బిజెపి పెద్దల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది .పవన్ కు రాజ్యసభ సభ్యుడు గా, కేంద్రమంత్రిగా అవకాశం కల్పించి, ఏపీ లో పాగా వేయాలనే దిశగా బీజేపీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.మరో రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు