కారు పార్టీని కుదిపేస్తోన్న బైపోల్ సెంటిమెంట్.. ఒకవేళ ఓడితే టీఆర్ఎస్ ఖేల్ ఖతం?

టీఆర్ఎస్ పార్టీని ఉపఎన్నిక సెంటిమెంట్ కుదిపేస్తోందని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది.దుబ్బాక, హుజురాబాద్ బైపోల్ టైంలో ఎన్ని అరెస్టులు చేయించినా.

వందల కోట్లు కుమ్మరించినా.ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేసిన కేసీఆర్‌కు అక్కడి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని బీజేపీ పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తాజాగా మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కేసీఆర్ సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించారు.

మరోసారి తెరపైకి దళితబంధు హుజురాబాద్ ఎన్నికల టైంలో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది.అర్హులైన దళితులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.అంతటితో ఆగకుండా ఓటర్లకు మందు, మద్యం,డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేశారు.ఆ ఒక్క బైపోల్ కోసం టీఆర్ఎస్ రూ.600 కోట్లు ఖర్చు చేసిందని వార్తలు రావడంతో దేశంలో కాస్ట్లీ ఎన్నికగా హుజురాబాద్‌ బైపోల్‌ను వర్ణించారు.కేసీఆర్ అంత చేసినా ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోయిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది.

అందుకే మునుగోడులో ఎలాగైనా గెలిచి ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వాసం కోల్పోలేదని నమ్మించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.అందుకోసమే సంక్షేమ పథకాల పేరిట భారీగా ఖర్చుచేసేందుకు కారు పార్టీ సిద్ధమైందట.

ఒకవేళ అనుకున్నట్టు గానే టీఆర్ఎస్ అభ్యర్థి మునుగోడులో ఓడితే జనాల్లో టీఆర్ఎస్ పై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది.వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మెజార్టీ సీట్లు కూడా రావని అధినేత కేసీఆర్ భయపడుతున్నారట.రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుండటం.

బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు జనాల్లో మంచి గుర్తింపు వస్తుండటం.అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి కేడర్‌ను రేవంత్ రెడ్డి యాక్టివ్ చేయడంతో టీఆర్ఎస్‌ బిక్కుబిక్కు మంటూ గడుపుతోందట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రాజగోపాల్ రెడ్డి ఓడితే బీజేపీకి ఏమీ పోదు.అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు.

Advertisement

టీఆర్ఎస్ ఓడితే మాత్రం కేసీఆర్ ప్రజా నమ్మకాన్ని కోల్పోయాడని.ప్రతిపక్షాలు రాష్ట్రంలోని ఓటర్లను నమ్మించేందుకు సిద్ధం అవుతున్నాయి.

తాజా వార్తలు