శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ,రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla District)జిల్లా :ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించార.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తబుషుల బోధనలను ద్వారా మహర్షి వాల్మీకి(Valmiki Maharshi) మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని(Ramayana book) మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.

ఈ కార్యాలయంలో జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి, సూపరింటెండెంట్ లు,సిబ్బంది పాల్గొన్నారు.

రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!
Advertisement

Latest Rajanna Sircilla News