రోడ్లపై వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుళ్ల భయం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉంటుంది.ఎందుకంటే వారు ఎక్కడ బండి ఆపేసి దాన్ని సీజ్ చేస్తారో అనే భయం ప్రతి ఒక్కరిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది.
అయితే కొన్ని సార్లు ప్రజలు కూడా తమ వాహనాలను సీజ్ చేస్తున్నా లేక ఫైన్లు వేస్తున్నా కూడా పోలీసులపై దాడులు చేసిన ఘటనలు కూడా అనేకం చూస్తున్నాం.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.ఎందుకంటే బైక్ తీసుకెళ్లినందుకు ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సైపూ విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు ఏకంగా తన వెంట తీసుకొచ్చిన కత్తితో పొడవడం కలకలం రేపుతోంది,.
వాస్తవానికి నిందితుడు హర్ష్ మీనా మూవీ చూసుందుకు తన బైక్‌పై ఓ సనిమా టాకీస్‌కు వెళ్తుండగా దారిలో నో పార్కింగ్ ఏరియాలో బండిని నిలపడంతో అక్కడే డ్యూటీలో ఉన్న ఎస్సై ఆ బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
ఇక దీంతో కోపానికి గురైన ఆ నిందితుడు కాస్త ఏకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ముందుగా ఫైన్ డబ్బులు రూ.600 చెల్లించాడు.కానీ అతని మనస్సులో మాత్రం ఆ ఎస్సైపై విపరీతంగా కక్ష పెంచుకున్నాడు.
ఇదే అదునుగా ఎస్‌ఐ శ్రీరామ్ దూబేని పోలీస్‌స్టేషన్‌లో గమనించిన ఆ సదరు నిందితుడు వెంటనే తన జేబులో ఉన్న కత్తిని తీసి ఆ ఎస్సైపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు.ఇష్టం వచ్చినట్టు పొడవడంతో పాటు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశారు.
కానీ అక్కడే డ్యూటీలో ఉన్న ఇతర పోలీసు సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.