వైరల్: సైకిల్ చక్రం రెండు ముక్కలైంది.. అయినా ముందుకు పోతోంది చూడండి?

ఎవరి క్రియేటివిటీ వారిది.కవితకు కాదేది అనర్హం అన్నట్టు ఎవరు ఎందులో నిష్ణాతులో మనం చెప్పలేము.

 The Bicycle Wheel Is Broken Into Two Pieces But See It Moving Forward Cycle, Vir-TeluguStop.com

అందుకే పిల్లను తమకి ఇష్టమైన దాంట్లోనే ఎంకరేజ్ చేయాలి.అప్పుడే పిల్లలు ఈ దేశానికి ఉపయోగపడతారు.

ఐడియా ఉండాలేగాని, రొటీన్ గా వుండేదానికన్నా భిన్నంగా జీవించవచ్చు అని ఓ యువకుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హితబోధ చేస్తున్నాడు.అతడేమి లెక్చర్లు ఇవ్వడం లేదండి బాబు.

ఓ సాధారణ సైకిల్ ని డిఫెరెంట్ వేలో ఎలా తయారు చేసి వాడుకోవచ్చో తేలిగ్గా తన వీడియోల ద్వారా తేలికగా చెబుతున్నాడు.

ఇక్కడ ముఖ్యంగా యువతకి సైకిల్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.

అంతేకాదు.ప్రతి ఒక్కరికీ తన బాల్యం నుండి యుక్త వయస్సుకి వచ్చే వరకు సైకిల్ తో అనేక అనుభవాలు ఉంటాయి.

ముఖ్యంగా సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు, వివిధ రకాల సైకిళ్లను ఇష్టపడతారు.సైకిల్‌కి గేర్ ఉంటే మరింత సంబరపడిపోతారు.

చిన్నప్పటి నుండి మనమంతా 2 చక్రాల సైకిళ్లను చూసివుంటాం.అయితే సైకిల్ వెనుక చక్రాన్ని రెండు ముక్కలు చేసి, దానిని వేగంగా నడిపించడాన్ని ఎక్కడైనా చూశారా? చూడలేదు కదూ.ఓ ఇంజనీర్ దీనిని చేసి చూపారు.ఇంజనీర్ కమ్ యూట్యూబర్ అయినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రత్యేకమైన సైకిల్‌ను తయారు చేశారు.‘ది క్యూ‘ పేరుతో ఛానెల్‌ని నడుపుతున్న ‘సెర్గీ గోర్డియెవ్‘, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్రియేషన్‌లకు ప్రసిద్ధి గాంచాడు.దాంతో యువత ఇతని వీడియోలు ఎక్కువగానే చూస్తున్నారు.

ఈయన తన తాజా వీడియోను షేర్ చేసి అందరిని తనవైపు తిప్పుకున్నాడు.ఈ వీడియో చూసినవారంతా అతని క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు.

ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 7 కోట్ల మంది వీక్షించారు.ఇంకెందుకాలస్యం మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube