బడాబాబులకు కానిదేమిటి? మరో లగ్జరీ కారు సొంతం చేసుకున్న అంబానీ!

అంబానీ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు.భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు అధినేత అయినటువంటి వీరి గురించి ఇక్కడ తెలియని వారుండరు.

 Ambani Owns Another Luxury Car , Luxury Car , Buy , Viral Latest, News, Viral, S-TeluguStop.com

ఎందుకంటే ఇండియాలో అత్యంత సంపన్న కుటుంబం మరియు అత్యంత ఖరీదైన కార్లు కలిగిన కుటుంబం కూడా వీరిదే.ఇప్పటికే అంబానీ కుటుంబం రోల్స్ రాయిస్ వంటి అత్యంత ఖరీదైన కార్లను కలిగి వుండగా తాజాగా మరో లగ్జరీ కారు అంబానీ గ్యారేజిలోకి వచ్చి చేరింది.

ముఖేష్ అంబానీ యొక్క కొత్త Bentley Bentayga తెలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా కనబడుతోంది.

ఇది అంబానీ ఫ్యామిలిలో చేరిన 3వ బెంట్లీ కారు కావడం విశేషం.

దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది చూడండి.బేసిగ్గా అంబానీకి తెలుపు రంగు వున్న కార్లంటే ఇష్టం.

ఇందులో రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఉంది.అయితే ఇప్పటికే తన వద్ద ఉన్న బెంట్లీ బెంటైగా కార్లు ఒకటి రేసింగ్ గ్రీన్ కలర్ లో ఉండగా, మరొకటి బ్రౌన్ కలర్ లో ఉండటం గమనార్హం.

ఇందులో ఒకటి డబ్ల్యు12 ఇంజిన్ కలిగి ఉండగా మరొకటి వి8 ఇంజిన్ పొందుతుంది.బెంట్లీ కంపెనీ గత సంవత్సరం వి8 డీజిల్ ఇంజిన్ నిలిపివేసింది.

Telugu Ambani, Reliance, Luxury Car, Rolls Royce, Latest-Latest News - Telugu

బెంట్లీ బెంటైగా వి8 పెట్రోల్ వేరియంట్ ధర అక్షరాలా రూ.4.10 కోట్లు. ఇంత ఖరీదైన బెంట్లీ బెంటెగా కారుని భారతదేశంలో డెలివరీని అందుకున్న వారిలో అంబానీ మాత్రమే వున్నారు.అంతే కాకుండా రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన బ్రెయిట్లింగ్ ముల్లినర్ టూర్‌బిల్లాన్ వాచ్‌ని కలిగి ఉన్న భారతదేశంలోని బెంట్లీ కారు కూడా ఇదే.ఇది 6.0-లీటర్ డబ్ల్యు12 పెట్రోల్ ఇంజన్‌తో వచ్చిన బెంటెగా యొక్క టాప్-ఎండ్, హై-పెర్ఫార్మెన్స్ వెర్షన్.ఇది గరిష్టంగా 600 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube