నల్లటి వలయాలను మాయం చేసే బెస్ట్ ఐ మాస్క్ మీకోసం!

నల్లటి వలయాలు( Dark circles ).మనలో ఎంతో మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

ముఖ్యంగా అమ్మాయిలు నల్లటి వలయాల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు.వాటిని వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఐ మాస్క్ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఐ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకుంటే వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

మరి లేటెందుకు ఆ ఐ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో స్లైసెస్, రెండు పీల్‌ తొలగించిన బంగాళదుంప ముక్కలు, రెండు కీర దోసకాయ స్లైసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder) వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టమాటో కీరా బంగాళదుంప జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో కళ్ళ చుట్టూ మాస్క్ లా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత తడి క్లాత్ సహాయంతో ఐ మాస్క్ ను తొలగించాలి.ఆపై రెండు లేదా మూడు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ తీసుకొని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ విధంగా చేశారంటే కళ్ళ చుట్టూ నలుపు మొత్తం మాయమవుతుంది.డార్క్ సర్కిల్స్ పరార్ అవుతాయి.కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్న త‌గ్గు ముఖం పడతాయి.

భారతదేశంలో కొరియన్ యూట్యూబర్ అపహరణ.. చివరికి ఏమైందో తెలిస్తే..?
బ్యాడ్ హాబిట్స్ ని వదులుకొని ఫ్యాన్స్ కి ఆదర్శంగా నిలిచిన స్టార్స్

కాబట్టి డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్న వారు, వాటిని వదిలించుకోవాలని తాపత్రయ పడుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న బెస్ట్ ఐ మాస్క్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు