తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం .
కానీ దశాబ్ధ కాలంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజీతో మోసం చేశారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడం కోసమే రేపు కాంగ్రెస్ సభ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని భట్టి తెలిపారు.ఈ మేరకు సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.
ఆ డిక్లరేషన్ ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.రేపటి హైదరాబాద్ సభకు నిరుద్యోగుల పెద్ద ఎత్తున తరలి రావాలని భట్టి కోరారు.