నాగ చైతన్య నెక్స్ట్.. ఈ ముగ్గురిలో ఎవరితోనో?

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య( Naga Chaitanya ) ఒకరు.ఈయన ఎంట్రీ ఇవ్వడం ప్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం మంచి హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.

 Interesting Buzz On Naga Chaitanya's Next, Venkat Prabhu, Naga Chaitanya, Custod-TeluguStop.com

వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ అక్కినేని యంగ్ హీరో( Akkineni Young Hero ) రాణిస్తున్నాడు అనుకునే లోపే మళ్ళీ రెండు వరుస ప్లాప్స్ పడ్డాయి.

Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Shiva Nirvana, Venkat Prabhu-Movie

థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా కూడా ప్లాప్ అవ్వడంతో చైతూ ఆలోచనలో పడ్డాడు.ఈసారి రూటు మార్చి రియలిస్టిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.నాగ చైతన్య ( Venkat Prabhu ) కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ”కస్టడీ” (Custody) సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.నాగ చైతన్య, కృతి శెట్టి ( Krithi Shetty) హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజ్ కు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో ఇప్పుడు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.ముగ్గురు డైరెక్టర్లను చైతూ లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.

Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Shiva Nirvana, Venkat Prabhu-Movie

ఈ ముగ్గురు డైరెక్టర్లు ఎవరంటే.యువ డైరెక్టర్స్ శివ నిర్వాణ, విజయ్ కనకమేడల, చందు మొండేటి కథలను చైతూ విన్నారని ఈ ముగ్గురిలో ఒకరికి ఈయన ఓకే చెప్పబోతున్నట్టు టాక్ వస్తుంది.ఇప్పటికే నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబోలో మజిలీ సినిమా వచ్చి మంచి సక్సెస్ అయ్యింది.అలానే చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి, ప్రేమమ్ సినిమాలు తెరకెక్కాయి.

ఇక విజయ్ కనకమేడల ఇటీవలే ఉగ్రం సినిమాతో మెప్పించాడు.దీంతో ఈ ముగ్గురు డైరెక్టర్ లలో చైతూ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube