నమ్మిన వారి చేతిలో దారుణం గా మోసపోయిన నటి...

The Actress Who Was Badly Cheated By Those Who Believed, Kovai Sarala, Comedian, Actress Kovai Sarala, R Krishna Direction, Mohan Babu, Brahmanandam

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు ఏదో ఒక సినిమాలో కనిపించాలి అని చాలా వరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే కొంత మంది సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు అలా తెలుగు లో మంచి సినిమాలు చేసి తనకంటూ కమెడియన్ ( Comedian )గా గుర్తింపు పొందిన నటి కోవై సరళ( Actress Kovai Sarala ) ఈవిడ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి… అయితే ఆమె ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది నమ్మిన వారే ఆమెని ఎలా మోసం చేశారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.

 The Actress Who Was Badly Cheated By Those Who Believed, Kovai Sarala, Comedian,-TeluguStop.com

మొదట గా ఈమె 1979 లో ఆర్ కృష్ణ డైరెక్షన్( R Krishna Direction ) లో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయింది.అయితే ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అయిన కుడా ఆమెకి చాలా మంచి గుర్తింపు వచ్చింది.

దాంతో ఆమె ముందని ముగించు అనే తమిళ్ సినిమాలో గర్భిణీ స్త్రీ గా నటించింది.ఇక అప్పటి నుంచి ఆమె కెరియర్ మలుపు తిరిగిందనే చెప్పాలి.ఇక తెలుగు లో మాత్రం 1987 లో మోహన్ బాబు హీరో గా వచ్చిన వీర ప్రతాపం అనే సినిమాలో నటించింది.ఈ సినిమా లో ఈమె చేసిన పాత్ర లో మొదట వేరే వాళ్ళని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ అవకాశం ఈమెకి వచ్చింది.

Telugu Actresskovai, Brahmanandam, Kovai Sarala, Mohan Babu, Krishna-Movie

అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోవై సరళ ఈ సినిమా లో చాలా బాగా నటించింది ఈ సినిమా తోనే తను తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.తను నటించిన మొదటి చిత్రం తోనే తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అప్పటి నుంచి చాలా రకాలైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది.ఇక బ్రహ్మనందం( Brahmanandam ) ఈమెది అయితే సూపర్ జోడి అనే చెప్పాలి వీళ్ల కాంబోలో వచ్చిన చివరి చిత్రం ప్రభాస్ హీరో గా వచ్చిన రెబల్ సినిమా…ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కోవై సరళ ఇద్దరు కూడా వాళ్ల కామెడి తో ప్రేక్షకులను నవ్విస్తారు.

Telugu Actresskovai, Brahmanandam, Kovai Sarala, Mohan Babu, Krishna-Movie

అయితే ఈమె మధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆవిడా ఈ విషయాలను పంచుకున్నారు.ఇక అందులో భాగంగానే ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రస్తావన కూడా రావడం జరిగింది.దానికి ఆమె స్పందిస్తూ మా అక్క చెల్లెల్లా కోసమే నేను పెళ్లి చేసుకోలేదు.వాళ్లందరికీ పెళ్లిళ్లు చేసి అందరిని విదేశాలలో సెటిల్ చేశాను నేను సంపాదించినా డబ్బులు మొత్తం వాళ్ళకే ఖర్చు చేశాను, వాళ్ల పిల్లల్ని చదివించాను ఇక ప్రస్తుతం నాదగ్గర ఏమి లేదు, ఉన్న ఈ కొద్దీ పాటి ఆస్తి మీద కూడా నాకుటుంబ సభ్యులు కేసు వేశారు అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసారు…అలా మొత్తానికి అయితే ఆమె వాళ్ల కుటుంబ సభ్యుల చేతిలోనే దారుణం గా మోసపోయారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube