దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఇలా ఈమె తెలుగు తమిళ భాషలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా శృతిహాసన్ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఈమె డూడూల్ ఆర్టిస్ట్ శంతను హజారికతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ ముంబైలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఇద్దరు నివసిస్తున్నారు.
ఇక శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఈమె చిత్ర బృందానికి గుడ్ బై చెప్పి ముంబై వెళ్ళిపోయారు ఇలా చాలా రోజుల తర్వాత తన ప్రియుడు దగ్గరికి వెళ్లిపోవడంతో తన ప్రియుడితో కలిసి వీకెండ్ చాలా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లి డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేసినటువంటి ఈమె తన ఆహారపు అలవాట్లకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా శృతిహాసన్ స్పందిస్తూ తనకు బయటకు వెళ్లి ఫుడ్ తినడం చాలా ఇష్టం అని తెలియజేశారు.నేను, శంతను తినడం కోసమే బతుకుతుంటాం.తినేటప్పుడు ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటాం.
నాలానే భోజన ప్రియుడ్ని నేను ఇష్టపడుతున్నందుకు, తను నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా లక్కీ అంటూ తన ప్రియుడు గురించి చెప్పుకొచ్చారు.ఇలా తిండి కోసమే మేం బ్రతుకుతున్నాం అంటూ శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఏడాది శృతిహాసన్ వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్ ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు.