తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా హ్యట్రిక్ కొట్టి గెలుపుగుర్రం ఎక్కేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.అయితే రాష్ట్ర పరిస్థితులు తెలుసుకునేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(పీకే)తో సర్వేలు చేపట్టారు.
కాగా రెండేండ్ల పాలనలో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్న మేరకు పీకే సలహాలతో రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం అప్రమత్తమయ్యాయి.
ప్రధానంగా పీకేకు పోటీగా సునిల్‌ను రంగంలోకి దింపనున్నట్టు టాక్.ఆయన సలహాలతో పార్టీ వ్యవహారాలు నడిపించనున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీ నుంచి మోడీ, హోంశాఖమంత్రి అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగనున్నారని తెలిసింది.ఇలా తెలంగాణలో గెలుపు రథచక్రం ఎక్కేందుకు మూడు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.
దీంతో రాజకీయ వేడి రాజుకుంది.
అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేక ఉందని దుబ్బాక జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో తేటతెల్లమైంది.
ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈటల వైదొలిగి బీజేపీలో చేరినా.ప్రజలు పట్టుబట్టి మరీ గెలిపించారు.
అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లోఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా ముందు జాగ్రత్త పడుతున్నాడు.
అందుకే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకున్నారని టాక్.ఇప్పటికే రాష్ట్రంలో రెండుసార్లు పీకే టీం సర్వే చేసి పలు నివేదికలు కేసీఆర్‌కు ఇచ్చింది.
ముఖ్యంగా నిరుద్యోగుల్లో అసంతృప్తి, ఉద్యమకారులపట్ల వివక్ష చూపడంతో పార్టీ ఆదరణ కోల్పోతోందని వెల్లడించింది.దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల ప్రకటన చేశారు.
ఇక దళితబంధు పథకం సక్సెస్‌కు పాటుపడుతున్నారు.మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
మరోవైపు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది.టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకమైన తరువాత్ జోష్ వచ్చినా కిందిస్థాయి కేడర్ నిరాశ చెందుతోంది.పార్టీలో అంతర్గతపోరును సద్దుమణిగించే వరకే సరిపోతోంది.ఈ క్రమంలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ రంగంలోకి దిగనున్నారు.పీకేకు పోటీగా మరో రాజకీయ వ్యూహకర్తయ సునిల్‌ను రగంలోకి దించనున్నారని సమాచారం.అయితే సునిల్ గతంలో పీకే టీంలో పని చేశారు.
సో రాజకీయ సర్వే అవగాహన ఉన్న సునిల్ కాంగ్రెస్ తరపున పని చేయాలని కోరగా ఓకే అనేశారట.ఈ నెల 4న సునిల్ రాష్ట్రం రానున్నారని టాక్.
ఇక టీఆర్ఎస్‌కు ధీటుగా పోటీనిస్తున్న బీజేపీ కూడా పావులు కదుపుతోంది.రాజకీయ వవ్యూహకర్తలపై ఆధారపడకుండా నేరుగా బీజేపీ నేతలే రంగంలోకి దిగనున్నారట.
తెలంగాణలో హోంమంత్రి అమిషా పావులు కదపడంతోపాటు తెలంగాణకు ప్రత్యేక నాయకులను నియమించనున్నారని తెలిసింది.ఇప్పటి వరకు అమిత్‌షా స్కెచ్‌లు సక్సెస్ అయ్యాయి.
ఇక తెలంగాణలోనూ స్కెచ్ వేసేందుకు రెఢీ అవుతున్నారు.