వైసీపీలో మూడు ముక్క‌లాట‌... ఆ లేడీ నేత కూడా గ్రూప్ క‌ట్టేశారే...!

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన టెక్క‌లిలో అధికార వైసీపీ మూడు గ్రూపులుగా విడిపోయింది.

ఇక్క‌డ అచ్చెన్న‌ను ఓడ‌గొట్టేందుకు జ‌గ‌న్ గ‌త ఎన్నికల్లో త్రిముఖ వ్యూహం ప‌న్నారు.

అక్క‌డ కాళింగ సామాజిక వ‌ర్గంలో సీటు కోసం పోటీ ప‌డుతోన్న వారిలో దువ్వాడ శ్రీనుకు శ్రీకాకుళం ఎంపీ సీటు, పేరాడ తిల‌క్‌కు టెక్క‌లి అసెంబ్లీ సీటు ఇచ్చారు.అయితే ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి శ్రీకాకుళం జిల్లా పార్ల‌మెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచినా టెక్కలిలో ఓడిపోవ‌డం.

పైగా అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కావ‌డంతో డిప్యూటీ ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ టెక్క‌లి బాధ్య‌త‌లు తీసుకున్నారు.దువ్వాడ శ్రీనుకు టెక్కలి పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.

Advertisement

పేరాడ తిల‌క్‌ను క‌ళింగ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ను చేశారు.దీంతో అంద‌రూ క‌లిసి ప‌నిచేసి అచ్చెన్న‌కు చెక్ పెడ‌తార‌ని అనుకున్నారు.

అయితే దువ్వాడ‌, పేరాడ వ‌ర్గాలు రెండుగా చీలిపోయి కొట్లాట‌ల‌కు దిగుతున్నాయి.వీరిద్ద‌రు ఒక‌రి స‌భ‌ల‌కు మ‌రొక‌రు ఆహ్వానించుకోవ‌డం లేదు.

రెండు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు.

దువ్వాడ‌కు టెక్క‌లి ప‌గ్గాలు ఇవ్వ‌డంతో త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గుతోంద‌ని భావించిన పేరాడ తిల‌క్‌, కిల్లి కృపారాణి ఒక్క‌ట‌య్యార‌ట‌.కృపారాణి సైతం దువ్వాడ‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నార‌ట‌.దీంతో వీరిద్ద‌రు చేతులు క‌లిపి తాము ఏర్పాటు చేస్తోన్న స‌భ‌ల‌కు దువ్వాడ‌ను పిల‌వ‌డం లేదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

దీంతో దువ్వాడ సీఎంకు ఫిర్యాదు చేయ‌గా.ఆ పంచాయితీ బాధ్య‌త‌లు విజ‌య‌సాయి రెడ్డికి అప్ప‌గించార‌ట‌.

Advertisement

చివ‌ర‌కు విజ‌య‌సాయి పేరాడ‌, కిల్లితో పాటు మంత్రి ధ‌ర్మాను పిలిచి క్లాస్ పీకార‌ట‌.అయినా వీరు తీరు మార‌డం లేదంటున్నారు.

ఏదేమైనా సంవ‌త్స‌రంన్న‌ర కాలంగా టెక్కలిలో పార్టీ ప‌టిష్ట‌త కోసం జ‌గ‌న్ వేస్తోన్న ప్ర‌ణాళిక‌లు అన్ని చిత్తవుతున్నాయి.దీంతో జ‌గ‌న్ సైతం విసుగుచెంది క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పే నాయ‌కుల‌ను వ‌దిలించుకోవ‌డ‌మే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యంతో ఏ నేత‌కు దెబ్బ ప‌డుతుందో ? చూడాలి.

తాజా వార్తలు