తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలను చూశారు.
అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీలో దర్శకుడు శ్రీనువైట్ల అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే.ఇక ఈ స్టార్స్ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున అంచనాలను పెట్టుకుంటారు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందరివాడు.అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా నిలబడింది.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఈ సినిమా విశేషాల గురించి గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ అందరివాడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం సినిమా కథ అని, ఆ కథలో తాను రచించలేదన్న విషయాన్ని శ్రీనువైట్ల తెలియజేశారు.
కథ సిద్ధంగా ఉంది వచ్చి డైరెక్ట్ చేయమంటే చేశానని అయితే అప్పటికే చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా శీను వైట్ల వెల్లడించారు.అయితే మరి ఆ విషయాన్ని చిరంజీవిగారికి ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్న శ్రీనువైట్లకు ఎదురైంది.

ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ చిరంజీవి గారు ఒక పెద్ద స్టార్.ఆయనతో వచ్చిన సమస్య అది.అతను స్టార్ కావడం వల్ల అతను తిరిగి సమాధానం చెప్పలేమని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.అలా 2005లో భూపతి రాజా అందించిన అందరివాడు సినిమా కథను తాను డైరెక్ట్ చేశానని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.