ఒకప్పుడు సినిమా ఎంటర్టైన్మెంట్ పొందాలి అంటే కేవలం థియేటర్ల వద్ద సినిమా విడుదల అవడం బాక్సాఫీస్ వద్ద పోటీ చేయడం ఉండేది.కానీ ఇటీవలి కాలంలో మాత్రం థియేటర్ లతోపాటు కూడా ఓటిటి లు కూడా ఉండటం గమనార్హం.
ఇకపోతే ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ థియేటర్లకు ఓటిటి ఏమాత్రం తగ్గకుండా టాప్ కాంబినేషన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి.వరల్డ్ బిగ్గెస్ట్ మూవీస్ అన్నింటినీ కూడా ఎంగేజ్ చేయడానికి ఓటిటి లు నేనంటే నేను అంటూ పోటీ పడుతూ ఉండడం గమనార్హం.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసుకుందాం.
ఇక ఈ వారం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నా త్రిబుల్ ఆర్ రిలీజ్ అవుతుంది.
అన్ని అడ్డంకులను దాటుకుని మార్చి 25వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమా పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అందరూ కూడా అంచనా వేస్తూ ఉండటం గమనార్హం.నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఏకంగా ఏడు వేల థియేటర్లలో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే విడుదలై మంచి హిట్ సాధించిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మార్చి 24 వ తేదీన అంటే త్రిబుల్ ఆర్ సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఆహాల్లో విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమాకి కూడా ఊహించని రేంజ్ లో ఆదరణ వచ్చే అవకాశం కూడా ఉంది.
ఒక పైపు ఓటిటి మరోవైపు థియేటర్లు రెండు వైపుల నుంచి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమైన తర్వాత ఎవరైనా సరే తమ సినిమాను వాయిదా వేసుకుంటారు.కానీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన కూడా వాలిమై అదే రోజు రాబోతుంది.
జీ 5 లో ఈ సినిమా విడుదల కాబోతుంది.ఇక మరికొన్ని క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా ఓటిటి వేడుకగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయ్ అన్నది తెలుస్తోంది.
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ లియోన్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్యార్లల్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోం.ది ఈనెల 23వ తేదీన ఇది విడుదల అవుతూ ఉంటే యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా హలో ఈనెల 24వ తేదీన విడుదల కాబోతుంది.మరో యాక్షన్ అడ్వెంచర్ మూవీ డ్యూన్ ఇంగ్లీష్ హిందీ తో పాటు సౌత్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతూ ఉంది.ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వేదికలో విడుదల కాబోతోంది.
దీంతో ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు.