ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.... ఆ హీరో పై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి త్రిష( Trisha ) ఒకరు.

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

ఇక త్రిష వయసు పైబడుతున్న తన అందం కూడా పెరుగుతూ వస్తుందని చెప్పాలి.ఈమెతో పాటు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారందరూ కూడా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా త్రిష మాత్రం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో( Megastar Chiranjeevi ) కలసి విశ్వంభర( Vishwambhara ) అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇదిలా ఉండగా తాజాగా త్రిష ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించారు.

మరి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) .ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ నేను హీరో విజయ్ దళపతికి ప్రత్యేక అభిమానిని అని తెలిపారు.ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమని తెలిపారు.

Advertisement

హీరో విజయ్ లవబుల్ పర్సన్ ఆయనతో పనిచేయటం నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని త్రిష హీరో విజయ్ దళపతి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.ఇక ఇటీవల వీరిద్దరూ కలిసి లియో సినిమాలో( Leo Movie ) నటించి ప్రేక్షకులను మెప్పించారు.అలాగే విజయ్ నటించిన గోట్ సినిమాలో త్రిష ఏకంగా స్పెషల్ సాంగ్ చేసి సందడి చేశారు.

ఇలా విజయ్ సినిమాలో తనకు ఎలాంటి పాత్ర వచ్చిన త్రిష మాత్రం నో చెప్పదని చెప్పాలి.అయితే వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో ఓ రూమర్ కూడా వైరల్ అవుతుంది.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్రిష కారణంగానే హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త వినపడుతూనే ఉంటుంది ఇలాంటి తరుణంలోనే ఈమె హీరో విజయ్ గురించి షాకింగ్ కామెంట చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన అబ్బాయి.. ఈ అబ్బాయి ఎవరంటే?
Advertisement

తాజా వార్తలు