పొత్తు కోసం ఎత్తులు  :  టీడీపీదే గెలుపు అంటూ ఆ ఛానెల్ సర్వే ?

ఏపీలో పొత్తుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.2024 ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఒంటరిగానే వైసిపి పోటీ చేయాలనీ చూస్తుండగా … ఏదో ఒక పార్టీ అండదండలతో ఎన్నికల్లో గెలవాలని మిగతా పార్టీలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి.ముఖ్యంగా బిజెపి జనసేన తో పొత్తు కొనసాగిస్తుండగా.

 That Channel Survey Says Tdp Is Winning Tdp, Janasena, Ysrcp, Bjp, Janasena Tdp-TeluguStop.com

టీడీపీ జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.అయితే సీఎం కుర్చీ విషయంలోనే జనసేనతో టిడిపి విధిస్తుండడంతో ఇంకా పొత్తు ఖరారు కాలేదు.

ఈ నేపథ్యంలో టిడిపి సైలెంట్ అయిపోయింది.కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

టిడిపి కాస్త తగ్గితే మంచిదని, గతంలో తాము త్యాగాలు చేశామని, ఈ సారి టిడిపి త్యాగం చేయాలంటూ ప్రస్తావించడంతో టిడిపి ఆలోచనలో పడింది.జనసేన చెప్పినట్లుగా ఆ పార్టీ కండిషన్స్ కు ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన కు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని, రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీ ని దెబ్బ తీస్తుందని భావిస్తోంది.

అందుకే జనసేన గ్రాఫ్ అంతగా లేదని, టిడిపితో పొత్తు ఎటువంటి కండిషన్లు లేకుండా పెట్టుకుంటే మంచిదని పరోక్షంగా హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఇటీవల టీడీపీ అనుకూల మీడియా గా పేరుపొందిన ఛానల్ నిర్వహించిన సర్వేలో టిడిపి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ,మిగతా పార్టీలకు అంతగా ప్రాధాన్యం లేదనే విషయాన్ని సదరు చానెల్ బయటపెట్టింది.సదరు చానెల్ నిర్వహించిన సర్వేలో 1.30 వేల మంది పాల్గొనగా … వీరిలో ఎక్కువ మంది వైసీపీ ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నట్లుగా పేర్కొంది.టిడిపి ఒంటరిగా పోటీ చేయాలని కోరుకునే వారి సంఖ్య 45.7 ఉండగా, టీడీపీ జనసేన పోటీ చేయాలని కోరుకునే వారి సంఖ్య 18 శాతం మాత్రమే ఉన్నట్లు ఛానల్ సర్వే లో తేలిందట.

Telugu Abn Survy, Andrajothi, Bjpjanasena, Janasena, Janasenatdp, Ysrcp-Politics

జనసేన, బీజేపీ టిడిపి కలిసి పోటీ చేయలి అని కోరుకునే వారి సంఖ్య 19.౨, బిజెపి జనసేన కలిసి పోటీ చేయాలని కోరుకునే వారి సంఖ్య 17.1 శాతంగా ఉంది.  అయితే ఇదంతా టీడీపీ కోసం జనసేన గ్రాఫ్ తగ్గించేందుకు ఆ ఛానెల్ ప్రయత్నించింది అనే విమర్శలు జన సైనికులు నుంచి వినిపిస్తున్నాయి.

జనసేన ను పెద్దగా ఎవరూ గుర్తించడం లేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎవరు కోరుకోవడం లేదనే విషయాన్ని హైలెట్ చేసి ,ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేయాలని తద్వారా ఎటువంటి కండిషన్స్ లేకుండా టీడీపీ తో జనసేన పొత్తు కొనసాగించే విధంగా చేయాలనే ప్రయత్నాలు టీడీపీ తో కలిసి సదరు ఛానెల్ చేస్తున్నట్టు గా అనుమానాలు జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube