టీడీపీలో ఆ వ‌ర్గం సైలెంట్‌.. చంద్ర‌బాబు అంత‌ర్గత‌ ప్ర‌క‌ట‌నే కార‌ణమా..?

రాజ‌కీయ పార్టీలు అంటేనే సామాజిక వ‌ర్గాల ఆధారంగా బ‌ల‌ప‌డుతాయి.ఈ విష‌యంలో టీడీపీ అయినా వైసీపీ అయినా జ‌న‌సేన అయినా ఒక్క‌టే.

 That Category In Tdp Is Silent Is It Because Of Chandrababu's Internal Manifest-TeluguStop.com

అయితే టీడీపీకి మొద‌టి నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గం అన్ని విధాలుగా అండ‌గా ఉంద‌నేది కాద‌న‌లేని స‌త్యం.ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు లాంటి వారంతా త‌మ సామాజిక వ‌ర్గానికి పెద్ద పీట వేశారు.

పైగా బీసీ సామాజిక వ‌ర్గాల‌ను కూడా బాగా క‌లుపుకుపోయారు.ఇక పోతే చంద్ర‌బాబు త‌ర్వాత మాత్రం క‌మ్మ నేత‌లు బాగా ఎదిగారు.

ఆయ‌న హ‌యాంలో వారు రాజ‌కీయంగా ఎన‌లేని ఖ్యాతిని గ‌డించారు.

అయితే ఇలా చంద్ర‌బాబు హ‌యాంలో పార్టీలో కేవ‌లం క‌మ్మ‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారికి కాకుండా.

క‌మ్మ‌ల‌కు మాత్ర‌మే సీట్లు, ప‌ద‌వులు ఇస్తున్నారంటూ ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఈ త‌ర‌హా కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.

దీంతో చంద్ర‌బాబు రీసెంట్ గా ఓ అంత‌ర్గ‌త ప్ర‌క‌ట‌న చేశారంట‌.పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారికి మాత్ర‌మే సీట్లు, ప‌ద‌వులు ఉంటాయ‌ని, మిగ‌తా వారికి ఉండ‌బోవంటూ చెప్పేశారు.

దీంతో పార్టీలో ఉంటున్న క‌మ్మ నేతలు మొత్తం ఇప్పుడు ఆందోళ‌న‌లో ప‌డిపోయారు.

ఈ కార‌ణంగానే వారు పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారంట‌.జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నారే త‌ప్ప ఎలాంటి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌ట్లేదు.ఇక చంద్ర‌బాబు మ‌ళ్లీ గెలిచేంత వ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోనంటూ శ‌ప‌థం చేసి క‌ష్ట‌ప‌డుతుంటే.

ఆ మేర‌కు క‌మ్మ నేత‌లు మాత్రం చురుగ్గా ప‌నిచేయ‌ట్లేద‌ని త‌మ్ముళ్లు ఆరోపిస్తున్నారంట‌.చంద్ర‌బాబు ఈ సారి క‌మ్మ‌ల‌కు కొంత ప్రాధాన్యం త‌గ్గిస్తార‌నే వాద‌న కూడా పార్టీలో క‌మ్మ నేత‌ల‌ను త‌ట‌స్థంగా మార్చేసింది.

మ‌రి క‌మ్మ నేత‌లు ఎన్ని రోజులు ఇలా సైలెంట్ గా ఉంటారో అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube