టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఎస్.ఎస్.
రాజమౌళి ( SS Rajamouli ) ఒకరు.ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటేనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలో ఉంటాయి.
అంత అద్భుతంగా ఈయన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.సినిమాపై ఈయనకు ఉన్న ఫ్యాషన్ తోనే సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు.
ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలేవి కూడా ఇప్పటివరకు ప్రేక్షకులను నిరాశపరచలేదు ఈయన సినిమాలు జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందాయి.
ఇక రాజమౌళి సినిమాలలో నటీనటుల ఎంపిక కూడా అలాగే ఉంటుంది ఆయన ఒక పాత్రకు ఒక సెలబ్రిటీని ఎంపిక చేశారు అంటే ఎన్నో విధాలుగా ఆలోచించి ఆ పాత్రకు వారిని ఎంపిక చేస్తూ ఉంటారు.ఇలా ఒకరిని సెలెక్ట్ చేశారు అంటే ఆ సెలక్షన్ వెనుక ఎన్నో కారణాలను రాజమౌళి చెప్పేస్తూ ఉంటారు.అయితే ఇలా ప్రతి ఒకరి పాత్రను ఎంపిక చేయడం వెనుక కారణాలను తెలిపినటువంటి రాజమౌళి తమన్నకు ( Tamannaah ) మాత్రం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా ఇదే విషయం గురించి మరోసారి రాజమౌళిని ప్రశ్నించారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ( Baahubali ) సినిమాలో ఈమె అవంతిక(Avanthika ) పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇలా మొదటి భాగంలో తమన్న పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పాలి ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడం వెనుక గల కారణం ఏంటి అని ఈమె పలు సందర్భాలలో రాజమౌళిని ప్రశ్నించిన ఆయన మాత్రం సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోతారట.ఇప్పటికీ ఆ పాత్రకు తనని ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలియడం లేదు అంటూ తమన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.