స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య సాంగ్ కాగా ఈ సాంగ్ పై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఒసేయ్ రాములమ్మా టైటిల్ సాంగ్ ఏ విధంగా ఉంటుందో ఈ సాంగ్ కూడా అదే విధంగా ఉందని నెటిజన్ల నుంచి జోరుగా కామెంట్లు వినిపించాయి.
ఈ కామెంట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దృష్టికి కూడా రాగా థమన్ ఈ కామెంట్ల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.
ఒసేయ్ రాములమ్మా సాంగ్ ను రాసింది వందేమాతరం శ్రీనివాస్ అని ఆ సాంగ్ కు నేనే వాయించానని థమన్ తెలిపారు.
జై బాలయ్య సాంగ్ చేస్తున్న సమయంలో ఒసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలిక వస్తుందనే విషయం నాకు తెలుసని థమన్ అభిప్రాయపడ్డారు.క్రౌడ్ థీమ్ పాటలు దాదాపుగా ఒకే పిచ్ లో ఉండటం వల్ల ఈ సాంగ్స్ ను వింటే గతంలో విన్న పాటలను మళ్లీ విన్న అనుభూతి కలుగుతుందని థమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
థమన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే బాలయ్య సినిమాకు అలాంటి నెగిటివ్ కామెంట్లు రాకుండా థమన్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.థమన్ చేతిలో ప్రస్తుతం భారీ స్థాయిలోనే ఆఫర్లు ఉన్నాయి.టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో థమన్ కు ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
థమన్ రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయలు కాగా ఈ మొత్తంలో ఎక్కువ మొత్తం సింగర్స్ కోసం ఖర్చు చేస్తున్నారని టాక్ ఉంది.కాపీ సాంగ్స్ కు దూరంగా ఉంటే థమన్ భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.